Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) కాపాడుతున్నది ఎవరు? ఆయన అరెస్టు కాకుండా అడ్డుపడుతుంది ఎవరు? ఆ స్థాయిలో కూటమి పెద్దలను మేనేజ్ చేస్తున్నారా? అంతగా అనిల్ కుమార్ యాదవ్ కు అండగా నిలబడుతున్నది ఎవరు? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ దూకుడు తెలియంది కాదు. సగటు టిడిపి, జనసేన కార్యకర్తకు అనిల్ కుమార్ యాదవ్ పై విపరీతంగా కోపం ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. వైసిపి ఐదేళ్ల కాలంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. తప్పకుండా ఆయన పేరు రెడ్ బుక్ లో ఉంటుందని అంతా భావించారు. కానీ ఏడాది అవుతున్న ఆయనపై కేసులు నమోదు కావడం లేదు. కనీస స్థాయిలో ఆయన పై చర్చ లేదు.
Also Read: ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు!
ఎన్నెన్నో కామెంట్స్..
ఎందుకన్నా తొందర.. వెయిట్ వెయిట్’ అంటూ అసెంబ్లీలో అయ్యప్ప మాల లో ఉంటూ చులకన చేసిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. ‘ఒరేయ్ పీకే.. నువ్వేం పీకలేవు’.. అంటూ పవన్ కళ్యాణ్ ను చులకన చేసేవారు. చంద్రబాబును దోపిడీ దొంగ, అసమర్ధుడు అంటూ కించపరిచారు. చిన్నా పెద్దా అంటూ తారతమ్యం చూసేవారు కాదు. ఎవరిని ఎంత మాట అనాలో కూడా అంత మాట అనేవారు. అటువంటి నాయకుడు ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని సగటు టిడిపి అభిమాని కోరుకున్నాడు. శ్రీకాకుళం( Srikakulam ) నుంచి అనంతపురం వరకు అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అన్న కమ్మనైన వార్త కోసం ఎదురు చూశారు. కానీ ఏడాది కాలంలో అనిల్ కుమార్ యాదవ్ జోలికి టిడిపి కూటమి ప్రభుత్వం వెళ్లకపోవడం విశేషం.
ఆ ఇద్దరూ ఎవరంటే..
అనిల్ కుమార్ యాదవ్ను తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కాపాడుతున్నారు అన్నది పొలిటికల్ వర్గాల్లో( political circle) చర్చ నడుస్తోంది. గతంలో అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వారు వైసీపీలోనే ఉండేవారని.. ఆయన ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందారని గుర్తు చేస్తున్నారు. కూటమిలోకి వచ్చిన వారు ఎంపీలుగా మారారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను వారే కాపాడుతున్నారన్న పాక్ మాత్రం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి పార్టీల శ్రేణుల్లో మాత్రం ఇది అసంతృప్తికి కారణమవుతోంది. ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఓ సీనియర్ మోస్ట్ లీడర్ అల్లుడు అదే సామాజిక వర్గానికి చెందిన వాడు. ఎంపీగా కూడా ఉన్నాడు. మరో నేత సైతం అనిల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ ఇద్దరు ఎంపీలే అనిల్ కుమార్ యాదవ్ విషయంలో అడ్డు తగులుతున్నారని టిడిపి వర్గాల్లోనే ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఏడాది గడుస్తున్నా అనిల్ యాదవ్ ను టచ్ చేయలేకపోవడం పై కూటమి పార్టీల్లో భిన్న స్వరం వినిపిస్తోంది. సదరు నేత విషయంలో ఆ ఇద్దరు ఎంపీల తీరుపై పార్టీ శ్రేణులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నాయి.
Also Read: వల్లభనేని వంశీ మోహన్ సంచలన నిర్ణయం!?
వారందరిపై ఫోకస్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే దూకుడు కలిగిన నేతలందరిపై ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. అరెస్టుల పర్వం కూడా నడిచింది. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ పై ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా పెట్టలేదు. కనీసం ఆయనను అరెస్టు చేసే ప్రయత్నం జరగలేదు. ఈ పరిస్థితులను తలుచుకుని ఎక్కువమంది టీడీపీ శ్రేణులు బాధపడుతున్నారు. అటువంటి నేతకు సాయం చేస్తున్న పార్టీ నేతల తీరుపై వారు మండిపడుతున్నారు. అయితే తప్పకుండా అనిల్ యాదవ్ పై చర్యలు ఉంటాయని టిడిపి నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.