AP Student Transport: ప్రభుత్వ పాఠశాలల( Government schools) విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇంటికి దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించేందుకు నిర్ణయించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠశాల తప్పనిసరిగా నిర్ణీత దూరంలోనే ఉండాలి. బడికి దూరంగా ఉంటే మాత్రం పిల్లలు వెళ్లి వచ్చేందుకు వీలుగా రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాఠశాలల్లో మార్పు కారణంగా.. బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు వీరందరికీ ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వాటాను జమ చేశారు. ఇది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read: ఆ విషయంలో జగన్ కు మేలు చేస్తున్న చంద్రబాబు!
విద్యాశాఖ పై ఫోకస్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సంస్కరణల్లో భాగంగా పాఠశాలల హేతుబద్ధీకరణ జరిగింది. మొత్తం తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 9600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సమీపంలోని 3,4,5 తరగతులను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు తరలించారు. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రాథమికోన్నత బడుల స్థాయిని కూడా తగ్గించారు. దీంతో 6,7,8 తరగతుల విద్యార్థులు సమీపంలోని ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి విద్యార్థులు రాష్ట్రంలో 79,860 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రవాణా చార్జీలను చెల్లించనున్నారు.
Also Read: చంద్రబాబు కంట్రోల్ లో బిజెపి.. ఆ ప్రచారం వెనుక నిజం ఎంత?
నెలకు రూ.600 చొప్పున..
ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించి కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్నా..6,7,8 తరగతుల పాఠశాలలు మూడు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువగా ఉన్నా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తారు. గతంలో అయితే విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ఒకేసారి 6000 రూపాయలను చెల్లించేవారు. అయితే మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. వీరందరికీ రవాణాచార్జీలు మూడు విడతల్లో అంటే.. ఒక్కో విడతలో 2000 రూపాయల చొప్పున అందించనున్నారు.
వాఁవ్ గ్రేట్ ఒన్.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు కి రవాణా చార్జీలు. pic.twitter.com/MbXCfH9iUa
— APARNA APARNA (@appugog) July 3, 2025