Heartwarming Moment: జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కొందరికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. మిగతా వారికి ప్రతి విషయంలోనూ ఇబ్బంది ఎదురవుతుంటుంది. తినే తిండి విషయంలో.. తాగే నీటి విషయంలో.. చదువుకునే బడి విషయంలో.. నివాసముండే ఇళ్లు విషయంలో.. ఇలా ప్రతిచోట వారు ప్రతిబంధకాలను ఎదుర్కోవాలి. కష్టాలను చవి చూడాలి. బాధలను దిగమింగు కోవాలి. ఇవన్నీ జరిగినప్పుడే వారికి జీవితం పూల పాన్పు అవుతుంది. ఇన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొనే వారికి ఎక్కడో ఒకచోట జీవితం టర్న్ అవుతుంది. ఆ తర్వాత వారికి విజయాలు దక్కుతాయి. ఆనందాలు మిగులుతాయి. అలాంటిదే ఈ వీడియోలో ఉన్న విద్యార్థి జీవితం కూడా..
ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు. ఆ విద్యార్థి పేరు కూడా తెలియదు. కాకపోతే సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతున్నది. విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఆ బాలుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోడానికి ఆ బాలుడు ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్నాడు. బహుశా ఆ బాలుడు ఉంటున్న గ్రామానికి బస్సు సౌకర్యం లేదనుకుంటా. అందువల్లే ఆ బాలుడు చదువుకోవడానికి ప్రతిరోజు నడక మార్గాన్ని ఎంచుకున్నాడు. అతడు వెళ్తున్న మార్గం కూడా అంత గొప్పగా లేదు. అయినప్పటికీ అతడు ఏమాత్రం భయపడకుండా చదువును సాగిస్తున్నాడు. దారిలో ముళ్లున్నా ఏరుకుంటూ.. రాళ్ళున్నా తొలగించుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాడు.
Also Read: గొప్ప దొంగవురా బాబూ.. చోరీ చేసి అమ్ముకొని ఆ ఇంట్లోనే పడకేసి.. నెక్ట్స్ లెవల్ అంతే!
ఆ బాలుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్న తీరు ఓ వ్యక్తికి నచ్చింది. ఎటువంటి సౌకర్యం లేకపోయినా సరే అతడు చదువుకోవడానికి పడుతున్న తాపత్రయం ఆ వ్యక్తిని కదిలించింది.. మరో మాటకు తావు లేకుండా.. ఆ విద్యార్థి తాపత్రానికి తనవంతుగా చేదోడు అందించాడు. సమీపంలో ఉన్న ఒక సైకిల్ షాప్ దగ్గరికి వెళ్లి.. అధునాతన సౌకర్యాలు ఉన్న ఓ సైకిల్ కొనుగోలు చేశాడు. ఒకరోజు ఆ బాలుడు పాఠశాలకు వెళ్లి వస్తుండగా.. మధ్యలో ఆ వ్యక్తి తన కారు ఆపి ఆ విద్యార్థి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ విద్యార్థికి ఇతడు ఎదురు పడగానే నమస్కారం చేశాడు. ఈ వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేసి తన వద్దకు పిలిపించుకున్నాడు. తాను కొనుగోలు చేసిన సైకిల్ పై ఓ వస్త్రాన్ని కప్పాడు. ఆ విద్యార్థిని తన వెంట తీసుకొచ్చి ఆ వస్త్రాన్ని తీయమన్నాడు. ఆ విద్యార్థి కూడా అలాగే చేశాడు. వస్త్రాన్ని తీసిన తర్వాత ఆ విద్యార్థికి అధునాతన సైకిల్ కనిపించింది. వెంటనే ఆ విద్యార్థి తన రెండు చేతులతో కళ్ళు మూసుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఏంటి ఇంత విలువైన సైకిల్ నాకే అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలియజేసాడు.
Also Read: మస్క్‌ను వదిలేశాడు.. జూకర్‌బర్గ్‌ను పట్టుకున్నాడు.. ట్రంప్ వ్యూహం ఏంటి?
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ వీడియోను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ” కష్టపడే వాళ్లకు తోడ్పాటు ఇవ్వాలి. అలాంటివారికి సపోర్ట్ ఇస్తేనే వారు మరింత ఎదుగుతారు. జీవితంలో స్థిరపడతారు. ఇటువంటి వీడియోలు కదిలిస్తాయి. కన్నీళ్లు తెప్పిస్తాయి. మనిషి జీవితానికి ఒక సార్ధకతను కలిగిస్తాయి. ఆ విద్యార్థికి సైకిల్ అందించిన ఆ వ్యక్తి ఆకాశమంత కీర్తిని అందుకున్నారు. ఇటువంటి పనులు చేయడం గొప్ప గొప్ప వ్యక్తులకే సాధ్యం. ఆ వ్యక్తి కూడా అటువంటి వాడే. అతడు మరింత గొప్ప పేరు తెచ్చుకోవాలని.. అతడు అద్భుతమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Respected pic.twitter.com/xS06V27m54
— Syed Mahaboob Basha (@Smahaboob17) July 2, 2025