Bihar election impact on Jagan: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దగా మాట్లాడలేదు. ఆపై తెలంగాణలో సైతం ఆయనకు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి.. తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రావడం పై జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో కూడా లేరు. జాతీయస్థాయిలో ఎన్డీఏ బలంగా ఉండగా.. ఇండియా కూటమి బలహీనం అవుతోంది. అయితే తక్కువ పార్టీలు ఉన్న ఎన్డీఏ ఎక్కువ బలంతో ఉంది. ఎక్కువ పార్టీలు ఉన్న ఇండియా కూటమి మాత్రం బలహీనంగా ఉంది. అయితే జాతీయస్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం క్రియాశీలకంగా ఉంది. అందుకే ఏదో ఒక కూటమిలో చేరాల్సిన అని వార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అయితే మొన్నటి బీహార్ ఎన్నికలతో తాను ఏ కూటమిలో చేరాలన్న దానిపై ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు మిత్రుడు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా పుంజుకుంటారని ఆశించారు. అయితే బీహార్ లో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ఇండియా కూటమి మరింత బలహీనమైంది. తెలంగాణలో కెసిఆర్ పార్టీ ఓడిపోవడంతో ఆప్షన్ లేకుండా పోయింది.
Also Read: మళ్లీ ‘అమరావతి’ ఉద్యమం!
జగన్ పరిస్థితి అగమ్య గోచరం
రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ బీహార్ లో( Bihar) ఇండియా కూటమి గెలిచి ఉంటే.. కర్ణాటక కాంగ్రెస్ ద్వారా రాజకీయం నడిపేందుకు జగన్ సిద్ధపడ్డారు. బెంగళూరు నుంచి తనదైన రాజకీయాలు నడిపి జాతీయస్థాయిలో ఇతర పార్టీల మద్దతుతో నెగ్గుకు రావాలని భావించారు. మరోవైపు బీహార్లో తేజస్వి యాదవ్ లాంటి నేతలను కలుపుకొని జాతీయస్థాయిలో సైతం చక్రం తిప్పాలని భావించారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడు సీఎం స్టాలిన్తో సైతం సన్నిహితంగానే గడుపుతూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, కేటీఆర్, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి వారితో జత కలవాలని చూశారు. కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడే జాతీయస్థాయిలో పావులు కదిపితే బిజెపి పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పదని భయపడుతున్నారు.
Also Read: అమరావతిలో తిరుపతి.. టీటీడీ గ్రీన్ సిగ్నల్!
అప్పట్లో చంద్రబాబు ప్రయత్నాలే వేరు..
వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. 2019లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. కేవలం బిజెపితో కటీఫ్ చెప్పడం వల్లే తమకు ఈ పరిస్థితి ఎదురైందని చంద్రబాబు గుర్తించారు. అందుకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించారు. వెంటనే టిడిపి రాజ్యసభ సభ్యులు కూడా బిజెపిలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో బిజెపికి కోపం వచ్చి ఎటువంటి పని కూడా చంద్రబాబు చేయలేదు. అయితే చంద్రబాబుతో పోల్చుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బిజెపికి దగ్గర ఎందుకు చేసిన ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు. అలాగని అప్పట్లో చంద్రబాబు విషయంలో బిజెపియేతర పార్టీలు సైతం సానుకూలంగా ఉండేవి. ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నడుమ చంద్రబాబు అలా ప్రవర్తించేసరికి వారు కూడా సర్దుబాటు చేసుకున్నారు. అయితే బిజెపికి చంద్రబాబు దగ్గరైనా.. ఏపీలో మాత్రం మిగతా రాజకీయ పక్షాలు అంతర్గతంగా చంద్రబాబు వైపే నిలబడ్డాయి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ కూడా సమర్థించలేదు. ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డీఏ లో ఉన్న.. దాని వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమికి చెందిన ఏపీ నేతలు ఎవరు చంద్రబాబును వ్యతిరేకించడం లేదు. అలాగని జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం లేదు. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి సంకట స్థితి అని చెప్పవచ్చు.