Homeవైరల్ వీడియోస్Thief Video: చిన్నారి అమాయకత్వానికి దొంగ కరిగిపోయాడు.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. వైరల్ వీడియో

Thief Video: చిన్నారి అమాయకత్వానికి దొంగ కరిగిపోయాడు.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. వైరల్ వీడియో

Thief Video: ఎవరూ పుట్టగానే నేరస్థులు కారు.. దొంగలు అంతకన్నా కారు.. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు వారిని అలా మార్చేస్తాయి.. బలమైన సంఘటనలు జరిగినప్పుడు అటువంటి వ్యక్తులు మారతారు. కరిగిపోతారు. కన్నీరు పెట్టుకుంటారు. అటువంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆ చిన్నారి ఏం చేసింది? ఆ దొంగ మనసు ఎలా కరిగిపోయింది?

సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు సినిమాకు మించి ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి దృశ్యాలను సినిమాలో కనుక పెడితే సినిమాలో సంచలనం అవుతాయి. ఎంతోమంది అభిమానుల నేత్రాల నుంచి కన్నీళ్లు కారే విధంగా చేస్తాయి.

ఆ ప్రాంతం ఎక్కడుందో తెలియదు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందో అంతకన్నా తెలియదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం అది ఒక షాపింగ్ మాల్ మాదిరిగా ఉంది.. అందులోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు.. దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. దీనిని ఆ దుకాణం యజమాని కూతురు పరిశీలించింది. అంతేకాదు, ఆ దొంగ దగ్గరికి వెళ్ళింది. ఓ లాలీ పాప్ తీసి ఆ దొంగకు ఇచ్చింది. తాను ఇంతటి దొంగతనం చేసినప్పటికీ.. డబ్బులు మొత్తం తీసుకుంటున్నప్పటికీ.. ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకపోగా.. తనకే లాలీపాప్ ఇవ్వడంతో ఆ దొంగ కదిలిపోయాడు. కన్నీరు పెట్టుకున్నాడు. తాను దొంగిలించిన డబ్బును మొత్తం వెనక్కి ఇచ్చి.. ఆ చిన్నారికి ముద్దు పెట్టి వెళ్లిపోయాడు.

సినిమాటిక్ మాదిరిగా ఉన్న ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ” ఆ దొంగ మొత్తానికి మారాడు. పోలీసులు ఎన్ని దెబ్బలు కొట్టినా.. న్యాయస్థానాలు ఎన్ని రకాలుగా శిక్షలు విధించినా ఆ దొంగ మారేవాడు కాదు. చివరికి ఒక చిన్నారి అతడికి బతుకు పాఠం నేర్పింది. అతడు మారే విధంగా చేసింది. ఒక మనిషి అనేవాడు మారడానికి బలమైన సంఘటన కావాలి. అది ఈ చిన్నారి రూపంలో అతనికి ఎదురైందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version