Life: ఒక వ్యక్తి తన జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఈ ఆలోచన అతనికి ఒక స్థిరమైన వయసు వచ్చిన తర్వాత వస్తుంది. మరి కొందరికి మాత్రం ఈ ఆలోచన వచ్చినా కూడా వాటిని అవాయిడ్ చేసి జల్సా లకు అలవాటు పడుతూ ఉంటారు. అలాకాకుండా తన జీవితం బాగుండాలని కోరుకునేవారు ప్రణాళికలు వేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తారు. అయితే ఇలాంటి ప్రణాళికలు వేసినా కూడా ఒక్కోసారి అనుకున్న స్థానానికి ఎదగలేక పోతారు. అందుకు కారణం ఏంటంటే ఒక వయసులో చేయాల్సిన పనిని మరొక వయసులో చేయడం. వాస్తవానికి ఏ వయసు నుంచి ఏ వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వయసు ఏది?
పుట్టిన ప్రతి అమ్మాయి లేదా అబ్బాయిని తల్లిదండ్రులు పెంచుతూ ఉంటారు ఇలా వారికి కౌమార దశ పూర్తయ్యే వరకు అంటే 15 సంవత్సరాల పాటు తల్లిదండ్రుల వద్దే జీవిస్తారు. ఆ తర్వాత 25 ఏళ్ల వరకు తమా చదువులో బిజీగా మారిపోతారు. 25 ఏళ్ల వరకు కనుక సరైన చదువు ఉండగలిగితే ఇప్పుడు జాబ్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 25 నుంచి 35 లేదా 40 ఏళ్ల మధ్య ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తున్నాడు? అనే దానిపైనే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దశ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే అనుకూలమైన ఆరోగ్యంతో పాటు అన్ని రకాల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ వయసులో సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అంతేకాకుండా మార్కెట్లో కూడా ఈ వయసు వారికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
40 ఏళ్ల తర్వాత నుంచి వారి జీవితం కొత్తగా ఉంటుంది. అంటే 40 ఏళ్ల వయసు వరకు ఎలాంటి పనులు చేశారో వాటిని ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ వయసులో కొత్త పనులను ప్రారంభించే ఆసక్తి ఉంటే వారి సామర్థ్యాన్ని బట్టి అభివృద్ధి చెందవచ్చు లేదా చెందకపోవచ్చు. కానీ 25 ఏళ్ల నుంచి 40 ఇళ్లలోపు ఎలాంటి పనులు అయితే చేస్తున్నారో.. అవే జీవితానికి చాలా ముఖ్యమైనవి. అందువల్ల ప్రతి యువత లేదా యువతీయులు 25 నుంచి 40 ఏళ్ల లోపు తమ జీవితానికి సంబంధించిన సరైన ప్లానింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత వేసే ప్లానింగ్ సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. ఈ సమయాన్ని చాలా పొదుపుగా వాడుకుంటూ అవసరమైన ప్రణాళికలు వేసుకుంటూ జీవిత గమ్యాన్ని చేరే ప్రయత్నం చేయాలి.
అయితే కొందరు 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు అనుకున్నది సాధించలేక పోతారు. కానీ వారికి జీవిత అనుభవం అయితే ఉంటుంది. అనుభవాన్ని బట్టి ఇప్పటినుంచి వారు కొత్తగా ఏ పని ప్రారంభించిన అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ 15 ఏళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలని మానసిక, ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.