Vijaysai Reddy
Vijaysai Reddy: రాజకీయాలకు( politics) గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. అయినా సరే ఆయనకు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. కాకినాడ పోర్ట్ లో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డి పై కేసులు నమోదయ్యాయి. ఈనెల 12న సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయి రెడ్డికి నోటీసులు అందించారు. సిఐడి జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన సిఐడి విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారకులంటూ విజయసాయిరెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై ఇప్పటికే టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కాకినాడ పోర్ట్ విషయంలో విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం విశేషం.
Also Read: విజయసాయిరెడ్డిని వదిలేదిలే.. పల్నాడు జిల్లాలో ఫిర్యాదు.. అరెస్టుకు రంగం సిద్ధం!
* కాకినాడ పోర్టులో అవకతవకలు
కాకినాడ పోర్టులో( Kakinada Port) భారీ అవకతవకలు జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. ఇందులో విజయసాయి రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడి ఎదుట హాజరయ్యారు. సిఐడి సైతం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీకి అని విమర్శలు వస్తున్నాయి. అయితే వరుసగా కేసులు చుట్టుముడతాయని తెలిసే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించినా.. కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.
* వరుసగా కేసులు
విశాఖ నగరంలో( Vishakha City ) విజయసాయిరెడ్డి కుటుంబం చుట్టూ అనేక వివాదాలు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. భీమిలి బీచ్ సమీపంలో ఆయన కుమార్తె నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపాలంటూ ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆ నిర్మాణాలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. కాకినాడ పోర్టు వ్యవహారం విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకోవడంతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి ఉన్నఫలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక ఏదో ఒకటి ఉందన్న అనుమానం ఉండేది. తాజాగా వరుసగా నమోదవుతున్న కేసుల బట్టి ఇది నిజమేనని తెలుస్తోంది.
* జగన్ కు నమ్మకమైన నేత
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. గెలుపోటములు ఎదురైనా విజయసాయి రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేవారు. పార్టీలో జగన్మోహన్ రెడ్డి తరువాత ఆయనదే స్థానం. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, బిజెపి నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులను సైతం వదులుకున్నారు. అయితే రాజీనామా చేసినా కేసులు మాత్రం వెంటాడుతుండడం విశేషం.
Also Read: చంద్రబాబు సీఎం అయ్యాడంటే పవన్ కళ్యాణ్ వల్లనే.. బాంబు పేల్చిన నాదెండ్ల*
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Big shock for vijayasai reddy cid notices in those cases
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com