VijayaSai Reddy : రాజకీయాల( politics) నుంచి పూర్తిగా నిష్క్రమించారు విజయసాయిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. అయితే ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ పై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనపై తాజాగా పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయసాయిరెడ్డి పై ఫిర్యాదులు రావడం విశేషం. పల్నాడు జిల్లాలో విజయసాయిరెడ్డి తో పాటు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై ఈరోజు కేసు దాఖలయ్యింది. దీంతో మరోసారి వెలుగులోకి వచ్చారు విజయసాయిరెడ్డి.
Also Read : విజయసాయిరెడ్డి యూ టర్న్.. జూన్ లో స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్!
* వేధింపులు భరించలేక?
వైయస్సార్ పార్టీ( YSR Congress ) 2019లో అధికారంలోకి వచ్చింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులు భరించలేక హైదరాబాదులో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక విజయసాయిరెడ్డి తో పాటు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తూ టిడిపి నేతలు నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఫిర్యాదులు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణ పై తప్పుడు కేసులు పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు టిడిపి నేతలు. వీరు పెట్టిన తప్పుడు కేసులు వల్ల కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
* ఆ కారణంతోనే
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ గా కోడెల శివప్రసాదరావును ఎంపిక చేశారు. అయితే నాడు శాసనసభను బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో కోడెల శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. అదే నాగరాజు కోడెల శివప్రసాదరావు తో పాటు ఆయన కుమారుడు పై ఫిర్యాదు చేశారు. అటు తరువాత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నాగరాజుతో విజయసాయిరెడ్డి తో పాటు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు కేసు పెట్టించారని తాజాగా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ముగ్గురు పై ఇప్పుడు నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు టిడిపి నేతలు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. అయితే తాను కోడెల శివప్రసాద్ తో పాటు ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టానని నాగరాజు ఒప్పుకున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారు.
* అరెస్టు తప్పదా?
అయితే వరుసగా వైయస్సార్ కాంగ్రెస్( YSRYSR Congress) నేతలపై టిడిపి శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆ ఫిర్యాదులను అనుసరించి పోలీసులు అరెస్టులు కొనసాగిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి విషయంలో కూడా మినహాయింపు లేదని తెలుస్తోంది. ఆయన కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళవచ్చు కానీ.. కానీ ఆయన చేసిన పాపాలు మాత్రం వెంటాడుతాయని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని విడిచిపెట్టే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : చంద్రబాబు సీఎం అయ్యాడంటే పవన్ కళ్యాణ్ వల్లనే.. బాంబు పేల్చిన నాదెండ్ల*