Backache Day: రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ వెన్నుపోటు దినం నిర్వహించిన సంగతి తెలిసిందే. కూటమి ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. అయితే కీలక నేతలు ఈ కార్యక్రమానికి ముఖం చాటేసారు. చివరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం బెంగళూరులో ఉండిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేత కూడా హాజరు కాలేదు. అయితే సాయంత్రానికి మాత్రం వెన్నుపోటు దినం సక్సెస్ అయిందంటూ ఓ ట్వీట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. అంతటితో ఆగకుండా పార్టీ అన్ని జిల్లాల నాయకత్వాలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వెన్నుపోటు దినం విజయవంతం అయిందని.. దానికి కొనసాగింపుగా జూన్లో భారీ కార్యక్రమాలు నిర్వహిద్దామని పిలుపునివ్వడం విశేషం.
Read Also: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సంచలన విషయం బయటపెట్టిన పవన్ రైట్ హ్యాండ్ నేత
* ఏడాది కూటమి వైఫల్యాలపై..
గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టిడిపి కూటమి( TDP Alliance) ఘన విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే కూటమి హామీలు ఇచ్చిందని.. ఇప్పుడు అమలు చేయడం లేదని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని సూచించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి క్యాడర్ మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించింది. పెద్ద నాయకులంతా రకరకాల కారణాలు చెప్పి డుమ్మా కొట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనీసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేదు. కేవలం జిల్లా కేంద్రాలకే పరిమితమైందన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని చెబుతోంది.
* దానికి స్ఫూర్తిగా..
వెన్నుపోటు దినం( Vennupotu Dinam ) విజయవంతమైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో మరో నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వైయస్సార్సీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు పాలన, ఏడాది వైఫల్యాలు, వైయస్సార్ కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాల నిర్వీర్యం వంటి వాటిపై ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. దీనికి కొనసాగింపుగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణకు వైయస్సార్సీపి నిర్ణయం తీసుకుంది.
Read Also: ప్రశాంత్ నీల్ vs సందీప్ రెడ్డి వంగ…ఈ ఇద్దరిలో ఎవ్వరు టాప్ లో ఉన్నారు..?
* నిర్వహణ కష్టమే..
అయితే వెన్నుపోటు దినం కార్యక్రమానికి జన సమీకరణ చేసేందుకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటువంటిది రౌండ్ టేబుల్( round table) సమావేశాలు అంటే మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది. విద్యార్థులు, మహిళలు, రైతులు, యువతతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని హై కమాండ్ ఆదేశించడం మాత్రం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. విద్యావేత్తలు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉండేవారు. సంక్షేమం కంటే అభివృద్ధిని కోరుకునేవారు. అటువంటి వారితో రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ కష్టమని వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి. కానీ హై కమాండ్ ఇచ్చిన టాస్క్ కాబట్టి.. నిర్వహించక తప్పని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది.