Prashanth Neel vs Sandeep Reddy Vanga : కే జి ఎఫ్ (KGF) సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasshanth Neel) ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఆయన ప్రభాస్ తో చేసిన సలార్(Salaar) సినిమా 700 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడంతో ఆయన మాములుగా దర్శకుడు కాదు అనే రేంజ్ లో ఇండియా వైడ్ గా ఒక గొప్ప గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు…పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఆయన చేసినవి మూడు సినిమాలే అయినప్పటికి అతనికి గొప్ప గుర్తింపు అయితే లభించింది. ఇక ఈ సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ ను ప్రేక్షకుల ముందు ఉంచి సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.
ఇప్పటివరకు ఈయన కూడా కేవలం మూడు సినిమాలే చేసినప్పటికి ఆ మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇక ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనేది చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ముగ్గురు మూడు సినిమాలతో మంచి విజయాలను సాధించారు. కాబట్టి రాబోయే సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ ని ఎవరు సాధిస్తే వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్ కి చేరుకుంటారు.
ఇద్దరిది డిఫరెంట్ స్టైల్ ప్రశాంత్ నీల్ మాస్ కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితే, సందీప్ రెడ్డివంగ మాత్రం డిఫరెంట్ జానర్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే సందీప్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం…ప్రశాంత్ నీల్ కూడా ప్రేక్షకులను మైమరిపింపజేసే సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు…మరి వీళ్ళిద్దరితో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు పోటీ పడుతున్నారంటే వీళ్ళిద్దరి స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…