Attack On CM Jagan: ఏపీ సీఎం జగన్ పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే గత అనుభవాల దృష్ట్యా చాలామంది లైట్ తీసుకున్నారు.సానుభూతి కోసమే ఇలా చేశారన్న కామెంట్స్ వినిపించాయి. మరోవైపు వైసీపీ అనుకూల మీడియా జగన్ పై హత్య ప్రయత్నం జరిగిందంటూ కథనాలు ప్రచురిస్తుండగా.. వ్యతిరేక మీడియా మాత్రం ఇది డ్రామాగా అభివర్ణిస్తూ కథనాలు వండి వార్చుతోంది. ముఖ్యంగా ఎల్లో మీడియా అతిగా కథనాలు రాస్తోంది.సాక్షి మీడియా గురించి చెప్పనవసరం లేదు. దీంతో అసలు ఏం జరిగింది అనే దానిపై సామాన్యుడికి క్లారిటీ లేదు.అయితే ఒక యువతి, ఓ మహిళ బోరున ఏడుస్తున్న వీడియోలను వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. వైసిపి అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
గత ఐదు ఏళ్ళుగా జగన్ పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు.పార్టీలకు అతీతంగా ఉచిత పథకాలు అందిస్తున్నారు.అదే సమయంలో అభివృద్ధి అనేది కనిపించడం లేదు.దీంతో చదువుకున్న వారు, ఉన్నత వర్గాలు జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. సామాన్య జనాలు మాత్రం అభిమానిస్తున్నారు. అయితే బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగిందని తెలియగానే.. వైసిపి శ్రేణులతో పాటు దిగువ స్థాయి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆరా తీయడం ప్రారంభించారు. అటు సోషల్ మీడియాలో సైతం జగన్ వ్యతిరేక, అనుకూల పోస్టులతో నిండిపోయాయి. ఎవరికి వారుగా విశ్లేషిస్తున్నారు. గతంలో కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య విషయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేసుకొని.. రకరకాలుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదో వైరల్ అంశంగా మారిపోయింది.
సానుభూతి కోసమే వైసీపీ శ్రేణులు ఈ ఘటనకు పాల్పడ్డాయని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అయితే ఈ క్రమంలో కొన్ని రకాల దిద్దుబాటు చర్యలకు వైసీపీ సోషల్ మీడియా ఉపక్రమించింది. ఈ క్రమంలోనే జగన్ పై దాడి ఘటనకు స్పందిస్తూ సామాన్యులు బాధపడుతున్న తీరును.. వీడియోలు, ఫోటోల్లో చూపడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఒక మహిళ సీఎం జగన్ పై దాడి ఘటనను టీవీలో చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మరో యువతి అయితే కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరి వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. జగన్ పై దాడి ప్రత్యర్థుల పనేనని ఆరోపిస్తూ ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు. అయితే సానుభూతికి అలవాటు పడిన వైసిపి బ్యాచ్ ఈ తరహా ప్రయత్నాలకు దిగుతోందని.. అందుకే గులకరాయి ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అయితే జగన్ కు చిన్న గాయమే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చకు దారితీసింది. ఎన్నికల వరకు ఇదో ప్రాధాన్యతాంశంగా మారనుంది.
జగన్ కు గాయం అవ్వడంతో బాధపడుతూ ఏడుస్తున్న pic.twitter.com/ARwu1U9wbn
— (@YSJ2024) April 13, 2024
జగనన్నపై పచ్చ గుండాల దాడికి , సంఘటన చూసి కన్నీటి పర్వమైన మహిళ pic.twitter.com/7gfQmPeHaA
— (@YSJ2024) April 13, 2024