https://oktelugu.com/

Rashmika Mandanna: గొప్ప అందగత్తెను, నటిని కాకపోయినా అందుకే ఎదిగాను… రష్మిక మందాన ఓపెన్ కామెంట్స్

సరిలేరు నీకెవ్వరూ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రష్మిక రేంజ్ మారిపోయింది. పుష్ప సినిమాతో రష్మిక ఫేమ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 14, 2024 / 03:12 PM IST

    Rashmika Mandanna

    Follow us on

    Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఇండియా వైడ్ చక్రం తిప్పుతుంది. నాగశౌర్య హీరోగా నటించిన ‘ ఛలో ‘ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు జంటగా నటించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో రష్మికకు ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కాయి.

    సరిలేరు నీకెవ్వరూ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రష్మిక రేంజ్ మారిపోయింది. పుష్ప సినిమాతో రష్మిక ఫేమ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రష్మిక అభిమానులను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ చిత్రం యానిమల్ తో భారీ విజయం అందుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ ఏకంగా రూ. 900 వందల కోట్లు వసూళ్లను రాబట్టింది.

    యానిమల్ చిత్రంలో రష్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా ప్రస్తుతం రష్మిక పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 లో పుష్ప ప్రియురాలిగా నటించిన రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్ భార్యగా కనిపించనుంది. రీసెంట్ గా రష్మిక బర్త్ డే సందర్భంగా పుష్ప 2 లో ఆమె లుక్ రివీల్ చేశారు. పట్టు చీర, ఒంటి నిండా నగలతో రష్మిక చాలా అందంగా కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన సక్సెస్ గురించి మాట్లాడింది. ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపుతున్నాయి.

    రష్మిక మాట్లాడుతూ .. నా కంటే అందమైన, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. కేవలం నాకు మంచి అవకాశాలు రావడం వల్ల ఈ స్థాయికి వచ్చాను. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జీవితంలో మనం పొందిన సంతోషాన్ని, విజయాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ మధ్య కాలంలో నేను నేర్చుకుంది అదే .. అని ఆమె అన్నారు. తాను అంత అందంగా లేకున్నా సక్సెస్ కావడానికి మంచి చిత్రాలు చేసే అవకాశం రావడమే అని పరోక్షంగా చెప్పింది. రష్మిక ఆసక్తికర కామెంట్స్ వైరల్ గా మారాయి. రష్మిక నేషనల్ క్రష్ ఏమిటని గతంలో బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఎగతాళి చేయడం కొసమెరుపు.