Health news : మర్మాంగాల్లో దురద, మంట ఎందుకు వస్తుందో తెలుసా?

పురుషుల్లో మాత్రం చెమటతో పాటు తడి బట్టలు వేసుకోవడం వంటి వాటివల్ల ఈ క్యాండిడా ఫంగస్ మరింత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. పురుషుల్లో మరికొన్ని కారణాల వల్ల కూడా ఈ ఫంగస్ వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోక పోవడం, మర్మాంగ చివరి భాగాన్ని చర్మంతో ఎక్కువగా కప్పి ఉంచడం వంటి వాటివల్ల మరింత పెరుగుతుంది.

Written By: NARESH, Updated On : April 14, 2024 3:53 pm

Why does itching and burning occur in the skin?

Follow us on

Health news : కొంత మందికి మర్మాంగాల్లో దురద మంట ఎక్కువగా వస్తుంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా క్యాండిడా ఆల్బికన్స్ అని పిలిచే ఫంగస్ వల్ల వస్తుందట. మగవారి కంటే ఆడవారిలోనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనుషుల్లో ఉండే సూక్ష్మజీవులతో కలిసే ఈ ఫంగస్ జీవిస్తుంటుందట. ఈ ఫంగస్ కు సమయం అనుకూలంగా ఉన్నప్పుడు వాటి సంఖ్యను ఎక్కువ చేసుకొని ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి.

సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరిగితే శరీరంలో సమతౌల్యం దెబ్బతింటుంది. అప్పుడే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంటుంది. మరి దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రుతుచక్రం, గర్భధారణ సమయంలో హార్మోన్లు ఇంబాలెన్స్ కావడం, హార్మోన్ ల రిప్లేస్మెంట్ వంటి వాటివల్ల ఈ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. యోనిలోని భాగాలు తడిగా, వెచ్చగా ఉంటే కూడా ఈ ఫంగస్ త్వరగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల మరింత సమస్యలు వస్తాయి.

పురుషుల్లో మాత్రం చెమటతో పాటు తడి బట్టలు వేసుకోవడం వంటి వాటివల్ల ఈ క్యాండిడా ఫంగస్ మరింత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. పురుషుల్లో మరికొన్ని కారణాల వల్ల కూడా ఈ ఫంగస్ వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోక పోవడం, మర్మాంగ చివరి భాగాన్ని చర్మంతో ఎక్కువగా కప్పి ఉంచడం వంటి వాటివల్ల మరింత పెరుగుతుంది.

ఇక లక్షణాల ఏంటంటే..మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల తెల్లని ద్రవం యోని నుంచి వస్తుంటుంది. అంతేకాదు మంట, మూత్రానికి వెళ్లినప్పుడు అసౌకర్యం, సెక్స్ సమయంలో నొప్పి వంటివి వస్తుంటాయి. మగవారిలో పురుషాంగంపై చిన్న ఎర్రటి మచ్చలు వస్తుంటాయి. చుక్కల మాదిరి పుండ్లు అవుతుంటాయి. ఇక స్త్రీ, పురుషుల్లో దురద ఎక్కువ వస్తుంటుంది అంటున్నారు నిపుణులు.