MP Vemireddy Prabhakar Reddy : వేమిరెడ్డికి అ’గౌరవం’.. అలక వెనుక కారణమేంటి?

చాలామంది రాజకీయ నేతలు గౌరవం కోరుకుంటారు. పదవుల కంటే గౌరవ ప్రతిష్టల కే విలువ ఇస్తారు. అటువంటి వారే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆ గౌరవం దక్కలేదని వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఒక సైతం అదే పరిస్థితి ఎదురు కావడం విశేషం.

Written By: Dharma, Updated On : November 4, 2024 5:09 pm

MP Vemireddy Prabhakar Reddy

Follow us on

MP Vemireddy Prabhakar Reddy : ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ది ప్రత్యేక స్థానం. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కూడా ఆ జిల్లాయే కారణం. ఆ జిల్లాలో పెద్దరెడ్లు ఉంటారు. వారికి సరైన గౌరవం దక్కాల్సిందే. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. వైసిపి పై అసంతృప్తి గళం వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పై ఒక రకమైన అసంతృప్తి రావడానికి కారణమయ్యారు. అయితే ఈ ముగ్గురు సరైన పదవులు దక్కకపోవడంతోనే పార్టీ మారారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. కేవలం తనకు గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఆయన వైసీపీని వీడాల్సి వచ్చింది. వైసీపీ ఆవిర్భావం నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. జగన్ కు అన్ని విధాల అండదండలు అందిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో అదే మాదిరిగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఏకపక్ష విజయానికి కారణమయ్యారు. జగన్ సైతం వేమిరెడ్డి సేవలను గుర్తించి రాజ్యసభ పదవి ఇచ్చారు. వారిద్దరి మధ్య అభిమానం అలా కొనసాగుతుండగా జిల్లాలోని అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తీరుతోనే వేమిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. తనకంటే జగన్ అనిల్ యాదవ్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని వేమిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాను నెల్లూరు ఎంపీగా, భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి తరఫున గెలిచారు. ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరులో వైసిపి పతనాన్ని శాసించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కేవలం గౌరవం దక్కలేదన్న కోణంలోనే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. కానీ ఇప్పుడు టిడిపిలో కూడా ఆయనకు అదే పరిస్థితి ఎదురైందన్న టాక్ ప్రారంభం అయ్యింది.

* డిడిఆర్సి మీటింగ్లో అవమానం
తాజాగా నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం జరిగింది. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ వేమిరెడ్డిని పిలవాల్సి ఉంది. కానీ ఆ పేర్లను చదువుతున్న ఆర్డిఓ వేమిరెడ్డిని పిలవలేదు. దీంతో ఆయన తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని తీసుకుని వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు. సమావేశానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గమనించి వేంరెడ్డిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన విసుగ్గా కారులో వెళ్లిపోయారు. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. మరోసారి అలా జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అయితే కేవలం అధికారులు ప్రోటోకాల్ పాటించలేదా? లేకుంటే మరో కారణమా? అసలు వేమిరెడ్డి ఆగ్రహానికి, అసంతృప్తికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న ఆసక్తికర చర్చ ప్రారంభం అయ్యింది.

* టిడిపిలో చాలా గౌరవం
వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిగా అవకాశం ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆయన పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని టాక్ నడిచింది. కేవలం తాను గౌరవం కోరుకొని టిడిపిలోకి వచ్చానని అప్పట్లో చంద్రబాబుకు వేమిరెడ్డి విన్నవించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇటీవల వేమిరెడ్డి భార్య ప్రశాంతి రెడ్డికి టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ఛాన్స్ వచ్చింది. పార్లమెంట్ కమిటీలో సైతంవేమిరెడ్డికి సముచిత స్థానం దక్కింది. వైసీపీలో కంటే టిడిపిలో తనకు ఎనలేని గౌరవం లభిస్తోందని ఆయన సైతం సంతోషంతో అనుచరుల వద్ద ప్రస్తావించారట. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన అలకబూనడం వెనుక అధికారుల తీరు కారణమా? లేకుంటేనేతల వైఖరి కారణమా?అన్నది తెలియాల్సి ఉంది. వైసిపి మాత్రం సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేస్తోంది.