https://oktelugu.com/

Pakistan Vs Australia: కమిన్స్ ను రెచ్చగొట్టాడు.. తర్వాత బంతికే అవుట్ అయ్యాడు.. పాపం పాక్ క్రికెటర్.. వైరల్ వీడియో

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. 46.4 ఓవర్లకు 203 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 4, 2024 / 05:10 PM IST

    Pakistan Vs Australia

    Follow us on

    Pakistan Vs Australia: పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 44, నసీం షా 40 పరుగులతో టాప్ స్కోరర్ లు గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు సాధించాడు. కమిన్స్, జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అబాట్, లభిషేన్ చెరో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలవడంతో బౌలింగ్ ఎంచుకుంది. నీతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ప్రారంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. అయూబ్(1), అబ్దుల్లా షఫీ కి (12) స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రిజ్వాన్, బాబర్ ఆజాం (37) ఇన్నింగ్స్ భారాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. అయితే జంపా వేసిన అద్భుతమైన బంతికి బాబర్ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కమ్రాన్ గులాం ధాటిగా బ్యాటింగ్ చేయడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కమిన్స్ ను దీటుగా ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో కమిన్స్ ను గేలి చేశాడు. 19 ఓవర్ ను కమిన్స్ వేయగా.. ఐదవ బంతిని గులాం డిఫెన్స్ ఆడాడు. ” కాస్త ఎదురు చూడు” అంటూ స్మిత్ లాగా కమిన్స్ కు బ్యాట్ చూపించాడు. గట్టిగా డైలాగ్ చెప్పాడు. ఇది కమిన్స్ కు చిరాకు తెప్పించింది.

    బోల్తా కొట్టించాడు

    కమ్రాన్ ఆస్ట్రేలియా తోనే వన్డేలోకి ఆరం గేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే అతి చేస్తున్న అతడికి బుద్ధి చెప్పాలని కమిన్స్ భావించాడు. దీంతో అతడు అత్యంత శక్తివంతమైన బౌన్సర్ వేశాడు. దానిని ఆడటంలో కమ్రాన్ విఫలమ. పైగా ఆ బంతి బ్యాట్ కు తగలడంతో వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ అద్భుతంగా ఒడిసి పట్టాడు. దీంతో కమ్రాన్ నిరాశతో మైదానాన్ని విడాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి కమ్రాన్ ఎంట్రీ ఇచ్చాడు. బాబర్ ప్లేస్ లో నాలుగో స్థానంలో అతడు బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. రెండో మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు కమ్రాన్ ఎంపికయ్యాడు. వన్డేలోనూ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతడు కమిన్స్ బౌన్సర్ కు అవుట్ కావడంతో.. అది ఆస్ట్రేలియా స్కోర్ పై ప్రభావం చూపించింది. కమ్రాన్ మాత్రమే కాకుండా మిగతా ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియా బౌలర్ల ఎదుట తలవంచారు. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ చేదించింది.. 3 వన్డేల సిరీస్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.