Donald Trump: ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికావైపు ఇప్పుడు అన్నిదేశాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ట్రంప్ గెలవాలని కోరుకుంటే.. కొందరు కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నారు. మరోవైపు అమెరికాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్‌పైనే చాలా మంది బెట్టింగ్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. ఈ క్రమంలో ఇండియాలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవాలని పూజలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక వేత్త మహా మండలేశ్వరస్వామి వేదముతినంద సరస్వతి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్నవారు తమ చేతిలో ట్రంప్ ఫొటో పట్టుకుని కనిపించారు. వేదమంత్రాలు, శంకునాదాల మధ్య పూజలు జరిగాయి. ఈ సమయంలో నరేంద్రమోదీ, ట్రంప్ ఉన్న ఫొటోను కూడా ఓ పండితుడు పట్టుకున్నాడు. కమలా హారిస్ భారత సంతతి నేత అయినా.. వీరు ట్రంప్ గెలవాలని కోరుకుంటున్నారు.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ..
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతర్జాతీయ వ్యూమాత్మక పొత్తులకు కేంద్ర బిందువు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఎన్నికలు పలు అంతర్జాతీయ అంశాలలో వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం వ్యవహారాల్లో అమెరికా పాత్ర ముగిసిపోవాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ అంశంలో అమెరికా జోక్యం పెరగాలని డెమోట్రకిట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భావిస్తున్నారు.
మొదలైన ముందస్తు పోలింగ్..
ఇదిలా ఉంటే.. అమెరికాలో ముందస్తు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే సుమారు 7 కోట్ల మంది ఓటు వేశారు. మంగళవారం(నవంబర్ 5న) జరిగే పోలింగ్‌లో మిగతావారు ఓటువేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కూడా కీలకంగా మారారు. స్వింగ్ స్టేట్స్‌లో భారతీయుల ప్రభావం ఎక్కువ. దీంతో ఇద్దరు నేతలు స్విగ్ స్టేట్స్‌పై దృష్టి పెట్టారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి.
WATCH | Delhi: Spiritual leader Mahamandelshwar Swami Vedmutinand Saraswati performs hawan and rituals for the victory of former US President #DonaldTrump in the US presidential elections.#USElections2024 pic.twitter.com/KwxvXEaSAn
— TIMES NOW (@TimesNow) November 4, 2024