Homeఆంధ్రప్రదేశ్‌AP petrol crisis latest news: ఏపీలో పెట్రో సంక్షోభం.. కృత్రిమ డిమాండ్‌ కొంప ముంచుతోంది!

AP petrol crisis latest news: ఏపీలో పెట్రో సంక్షోభం.. కృత్రిమ డిమాండ్‌ కొంప ముంచుతోంది!

AP petrol crisis latest news: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌ కొరత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. విపక్షైసీపీఆయకులునిపై నిరసనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఏపీలో ఈ పరిస్థితి నెలకొందని మాజీ సీఎం జగన్‌ విమర్శించారు. పొరుగున ఉన్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి కొరత లేదని కూటమి అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం ప్రజలకు పెట్రోల్, డీజిల్‌ దొరకడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే సమస్యకు ప్రధాన కారణాలు పానిక్‌ కొనుగోళ్లు, సరఫరా ఆలస్యాలు, పరిశ్రమల డిమాండ్‌ మార్పులు అని అధికారులు చెబుతున్నారు.

కొరత తీవ్రత
రాష్ట్రవ్యాప్తంగా 4,500కి పైగా పెట్రోల్‌ బంకుల్లో 10–70 శాతం మూతపడ్డాయి. కర్నూలు, నంద్యాల్, గోదావరి, విశాఖలో నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి. రోజువారీ 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9 వేల కిలో లీటర్ల డీజిల్‌ అమ్మకాలకు 50 శాతం అధిక డిమాండ్‌ ఏర్పడటంతో సంక్షోభం తీవ్రమైంది. దొరకదనే కారణంతో చాలా మంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు.

సమస్యకు ప్రధాన కారణాలు
పానిక్‌ భయంతో అనవసర కొనుగోళ్లు పెరగడం కొరతకు ప్రధాన కారణం. సాధారణ అమ్మకాలకు రెట్టింపు డిమాండ్‌ వచ్చింది. పారిశ్రామికులు అధిక ధరల కారణంగా రిటైల్‌ డీజిల్‌కు మారారు, వ్యవసాయ రంగంలో కూడా డిమాండ్‌ పెరిగింది. యుద్ధాలు, ఆయిల్‌ కంపెనీల రెండు రోజుల ఆలస్య సరఫరా, క్రెడిట్‌కు బదులు క్యాష్‌ డిమాండ్‌ కృత్రిమ కొరతను మరింత పెంచాయి.

ప్రభుత్వ చర్యలు..
సీఎం చంద్రబాబు పరిస్థితిపై సమీక్షలు నిర్వహించారు. అధిక సరఫరా కోరారు. . మంత్రి నాదెండ్ల మనోహర్‌ కొరత లేదని, పోయోకపోతే డీలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు సంస్థల సరఫరా ఆగిపోవడంపై కూడా చర్చించారు.

పానిక్‌ కొనుగోళ్లు తగ్గిస్తే సమస్య త్వరగా సద్దుమణుగుతుంది. ఆయిల్‌ కంపెనీలు సరఫరాను మెరుగుపరచాలి, పరిశ్రమలకు ప్రత్యేక సరఫరా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం డీలర్లను పరిగణనలోకి తీసుకుని, పారదర్శకత పెంచాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper