AP Mega DSC : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి. ఈ సమయంలో ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే పెడతానని ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. 2024 జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డీఎస్సీ(DSC) ఫైల్‌పై సంతకం కూడా చేశారు. పది నలలు గడిచాయి నోటిఫికేషన్ మాత్రం రాలేదు. దీంతో నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఈతరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో(APril First Week) మెగా డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. ఈ నోటిఫికేషన్(Notification)ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియను జూన్ నెలలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు పూర్తి చేసి, నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్చి 25, సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read : 75% హాజరు తప్పనిసరి, కఠిన నిబంధనలతో విద్యార్థులకు సవాల్
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా లేదు..
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని, నిరుద్యోగ యువతను నిరాశకు గురిచేసిందని చంద్రబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశానని, ఇప్పుడు దానిని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్స్(SGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), స్కూల్ అసిస్టెంట్స్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకతను నిర్వహించి, అవకతవకలకు తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
చిగురించిన ఆశలు..
ఈ ప్రకటనతో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. అయితే, కొందరు ఆకాంక్షితులు ఎక్స్ వేదికగా తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లోనే పరీక్షలు నిర్వహిస్తే తమపై ఒత్తిడి పెరుగుతుందని, పరీక్షలను జూలై లేదా ఆగస్టు నెలలో నిర్వహించాలని కోరుతున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : ‘ఈనాడు’ పై మారుతున్న టిడిపి అభిప్రాయం.. ఎమ్మెల్యేల హెచ్చరికలు!