Ram Charan
Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో చిరంజీవి…ఆయన ఇండస్ట్రీ కి రావడానికి ముందు సినిమా ఇండస్ట్రీ ఒకలా ఉండేది. కానీ ఆయన వచ్చిన తర్వాత సినిమా స్టైల్ అనేది మారిపోయింది. అప్పటి వరకు ఎవ్వరూ చేయనటువంటి బ్రేక్ డ్యాన్సులు చేస్తు, భారీ ఫైట్లు చేస్తు యావత్ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే చిరంజీవి మెగాస్టార్ గా మారిపోయాడు…ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మెగాస్టార్ గానే కొనసాగుతున్నాడు. ఇక తన కొడుకు అయిన రామ్ చరణ్ సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు…
మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్(Ram Charan)… ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అయితే మార్చి 27వ తేదీన తన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రిలీజ్ చేస్తారా అంటూ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో సినిమా మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని గాని గ్లింప్స్ గాని రిలీజ్ చేసినా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం సందడి చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే అతని బర్త్ డే ని పురస్కరించుకొని రచ్చ రచ్చ చేస్తున్న మెగా అభిమానులు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.
Also Read : 2వ సారి తల్లైన రామ్ చరణ్ హీరోయిన్..వైరల్ అవుతున్న ఫోటోలు!
గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో కొంతవరకు వెనుకబడిన రామ్ చరణ్ రాబోయే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించి భారీ స్టార్ డమ్ ను సంపాదించుకుంటాడు అనే ధీమాతో ప్రతి ఒక్కరు ఉన్నారు. మెగా అభిమానులను ఆనందపరచడానికి ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మంచి కాన్సెప్ట్ లను ఎంచుకొని భారీ విజయాలను సాధిస్తూ ఆయనకంటూ గొప్ప గుర్తింపు సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక రామ్ చరణ్ బర్త్ డే ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ అనేకచోట్ల రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెగా అభిమానులకు ఇదొక పండుగ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి అంత మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కావడం విశేషం.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేయబోయే సినిమాలను మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మరి ఇక మీదట రాబోయే సినిమాల్లో కూడా ఆయన మంచి పాత్రలను ఎంచుకొని తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : రామ్ చరణ్ బర్త్ డే కి ఫ్యాన్స్ చొక్కలు చించుకోవాల్సిందేనా..?