https://oktelugu.com/

AP Liquor Scam: ఐదేళ్లలో భారీ మద్యం కుంభకోణం.. ఆ నలుగురే కీలకం

విపక్షంలో ఉన్నప్పుడు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక దశల వారి మద్య నిషేధం ముసుగులో.. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 15, 2024 / 10:24 AM IST

    AP Liquor Scam

    Follow us on

    AP Liquor Scam: గత ఐదేళ్లలో మద్యం ద్వారా వేలకోట్ల రూపాయలు దోచుకున్నారా? ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట భారీ దోపిడీ జరిగిందా? ప్రభుత్వంలోని ఆ నలుగురు పెద్దలే లబ్ధిదారుల? మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల్లో వారే కీలకంగా వ్యవహరించారా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడు మాజీ సీఎం జగనేనని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. డిస్టలరీలను చేజిక్కించుకోవడం నుంచి జే బ్రాండ్ల తయారీ వరకు అంతా మాఫియా తరహా దందా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    విపక్షంలో ఉన్నప్పుడు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక దశల వారి మద్య నిషేధం ముసుగులో.. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలను తమ గుప్పిట పెట్టుకొని ఐదేళ్లలో భారీగా దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల విలువైన ఈ కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు మాజీ సీఎం జగన్ అని.. వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీరి బినామీలనే పేరు ఉన్న కంపెనీలకే ఐదేళ్లలో దాదాపు పదివేల కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దాకడం వీటికి బలం చేకూరుస్తోంది. దీనిపై సిబిఐతో పాటు ఈడి దర్యాప్తు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

    ప్రభుత్వం సొంతంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే వైసిపి నేతలు కొంతమంది బినామీల పేరిట మద్యం సరఫరా కంపెనీలను ఏర్పాటు చేశారు. అప్పటికే ఇతరుల పేరుతో ఉన్న డిష్టలరీలు, బ్రూవరీస్ ను బలవంతంగా లాక్కున్నారు. ఊరు పేరు లేని జేబ్రాండ్లు తయారు చేయించి జనం పై వదిలారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. పేరు మోసిన బ్రాండ్లకు చెక్ చెప్పారు. అదే సమయంలో నగదు లావాదేవీలను మాత్రమే ప్రోత్సహించారు. మద్యం వ్యాపారం మొత్తం మాఫియా తరహాలో గుప్పెట్లో పెట్టుకుని దోచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద డిస్టలరీల్లో ఒకటైన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ను మిథున్ రెడ్డి అనాధికారికంగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సెంటినీ బయో ప్రొడక్ట్స్ డిస్టలిరిను సైతం సొంతం చేసుకున్నారు. ఇక విజయసాయిరెడ్డి దందాకు అంతే లేకుండా పోయింది. తన అల్లుడైన రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించి భారీగా దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికైతే గత ఐదు సంవత్సరాలుగా మధ్యలోనే వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సిబిఐతో పాటు ఈడి దర్యాప్తు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.