AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు తీరం దాటి అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటనుండడంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తాలోని ఓడరేవుల్లో ఒకటో నెంబర్ హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
* ఈరోజు ఈ ప్రాంతాల్లో..
ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు.. కోస్తా ప్రాంతంలోని పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మాస్టరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం.. కోస్తాలోని బాపట్ల, రాయలసీమలోని తిరుపతి, శ్రీ సత్య సాయి జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వానలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని.. ఉరుములతో పాటు మెరుపులు ఉండే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
* వర్షపాతం నమోదు..
ఏపీ వ్యాప్తంగా సోమవారం వర్షాలు నమోదయ్యాయి. ఏలూరులో 67.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 35.2, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 30, ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీ లో 30, ఏలూరు జిల్లా వేలూరుపాడులో 28, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో 27, బాపట్ల జిల్లా రేపల్లెలో 22, గుంటూరు జిల్లా తెనాలిలో 22, గుంటూరు జిల్లా లామ్ లో 22, బాపట్ల జిల్లా సంతమగులూరులో 21, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో 20, కృష్ణాజిల్లా ముసలి పట్టణంలో 20, గుంటూరు జిల్లా అమరావతిలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* కనిపించని ప్రభావం..
గత రెండు రోజులుగా తీవ్రవాయుగుండం ప్రభావం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.. దీంతో భారీగా వర్షాలు పడతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం వర్షాలు పడలేదు. గత రెండు నెలలుగా వర్షపాతం లోటుతో ఖరీఫ్ పనులు ప్రారంభం కాలేదు.. ఈ వాయుగుండంతో భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేశారు.. కానీ ఆ అంచనాలు తప్ప. ఈ సీజన్లో ఈనెల 27 వరకు చూస్తే వర్షపాతం లోటు 54 శాతానికి చేరింది. రుతుపవనాలు విస్తరించినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.