https://oktelugu.com/

ఏపీలోని ఆ గ్రామంలో ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు పెద్ద మొత్తంలో ఇస్తుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే సర్పంచ్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలను మించి అభ్యర్థులు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఏపీలోని ఒక గ్రామంలో ఒక్క ఓటు 40,000 రూపాయలు పలుకుతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలోని చిన్న గ్రామంలో 1,000 కంటే తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండగా ఒక్క ఓటు 1,000 రూపాయలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 10, 2021 / 10:35 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు పెద్ద మొత్తంలో ఇస్తుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే సర్పంచ్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలను మించి అభ్యర్థులు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఏపీలోని ఒక గ్రామంలో ఒక్క ఓటు 40,000 రూపాయలు పలుకుతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

    పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలోని చిన్న గ్రామంలో 1,000 కంటే తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండగా ఒక్క ఓటు 1,000 రూపాయలు పలుకుతోంది. ఈ గ్రామంలో ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు పదివేల రూపాయల చొప్పున పంచగా ఒక వార్డులో ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఆ వార్డులోని ఓటర్లకు 10 వేల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

    మొత్తం ఆ వార్డులో 110 మంది ఓటర్లు ఉండగా ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున సర్పంచ్ అభ్యర్థులు, ఉపసర్పంచ్ అభ్యర్థులు 40 వేల రూపాయలు ఓటుకు పంచారు. ఒక్క ఓటుకు 40 వేల రూపాయలు రావడంతో ఓటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఓటు భారీ రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు సత్తా చాటారు.

    టీడీపీ, ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతుదారులు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. తొలి దశ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించడంతో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.