వైఎస్ షర్మిల నూతన పార్టీకి కారణాలు ఇవేనా..

వైఎస్ఆర్ కూతురు షర్మిల మంగళవారం లోటస్ పాండ్ వేదికగా.. తెలంగాణలోని తన సన్నిహితులతో, పార్టీ అభిమానులతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. హఠాత్తుగా షర్మిల పార్టీ పెట్టేందుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు ఇరు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే పార్టీ విషయంలో షర్మిల నేరుగా స్పందించకుండా తాను పార్టీ ఎందుకు పెట్టకూడదని ఎదురుప్రశ్న సంధించారు. దీంతో పార్టీ పెట్టే ఉద్దేశం ఆమెకు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైఎస్సార్ లేని లోటు […]

Written By: Srinivas, Updated On : February 10, 2021 10:27 am
Follow us on


వైఎస్ఆర్ కూతురు షర్మిల మంగళవారం లోటస్ పాండ్ వేదికగా.. తెలంగాణలోని తన సన్నిహితులతో, పార్టీ అభిమానులతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. హఠాత్తుగా షర్మిల పార్టీ పెట్టేందుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు ఇరు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే పార్టీ విషయంలో షర్మిల నేరుగా స్పందించకుండా తాను పార్టీ ఎందుకు పెట్టకూడదని ఎదురుప్రశ్న సంధించారు. దీంతో పార్టీ పెట్టే ఉద్దేశం ఆమెకు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైఎస్సార్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజన్న రాజ్యంలో రైతు రాజులా ఉండేవాడు.. తెలంగాణలో తాను రాజన్న స్వర్ణ యుగాన్ని తెస్తానని పేర్కొన్నారు. మొత్తానికి షర్మిల వ్యాఖ్యల వెనక పార్టీ పెట్టాలనే ఉద్దేశం బలంగానే ఉందన్న అంశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

Also Read: ఎన్నికల తరువాత కథ వేరే ఉంటది..

అయితే హఠాత్తుగా ఆమె పార్టీ పెట్టడానికి కారణాలు ఏమిటి..? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతోంది. పలు టీవీ చానళ్లలో షర్మిల సన్నిహితుడు గోనె ప్రకాశ్ రావు పలు ఆసక్తికర విషయాలు చెబుతూనే వస్తున్నారు. జగన్ 2019 ఎన్నికల్లో షర్మిలకు లోక్ సభ సీటు ఇస్తానని ఇవ్వలేదని, 2020లో రాజ్యసభ సీటు ఇస్తానని తరువాత సముదాయించారని, ఈ విషయంలో షర్మిల కొంత బాధ పడిందని చెబుతున్నారు. అయితే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్న కారణంగా జగనుకు పోటీ అనుకోవలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ జగన్ భార్య భారతి, షర్మిలకు మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని కుండ బద్ధలు కొట్టారు.

మరో వైపు రాజకీయవర్గాల్లో షర్మిలకు సొంత రాజకీయల లక్ష్యలు ఉన్నాయని.. జగన్ తో పోలిస్తే.. ఆయన కన్నా తాను ఎక్కువదూరం పాదయాత్ర చేశానని, పార్టీకోసం ఎక్కువ కష్టపడ్డాననే భావనలో షర్మిల ఉందని అంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగవచ్చు. జగన్ మీద ఉన్న కేసుల నేపథ్యంలో అనూహ్యంగా జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే.. షర్మిల ఇప్పటి నుంచే పవర్ సెంటర్ గా మారితే.. అప్పుడు ముఖ్యమంత్రి పదవికి తాను ప్రధాన పోటీదారు అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: 40 ఏళ్ల అనుభవం.. అడ్డం తిరుగుతోందా..?

కానీ తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల జగన్ ను ఇరుకున పెట్టే అవకాశం పెద్దగా లేదనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో పార్టీ అంటూ.. ఏర్పాటు చేసిన తరువాత దాన్ని ఆంధ్ర ప్రదేశ్ కు విస్తరించే అవకాశం కూడా ఉంటుందని.. ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. షర్మిల ప్రస్తుతం జరుపుతున్న ఆత్మీయ సమ్మేళనాలు కేవలం తన డిమాండ్లను అన్నవద్ద సాధించుకునేందుకే వ్యూహం రచిస్తోందని పలువురు అంటన్నారు. కానీ షర్మిల రాజకీయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆస్తకి కరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్