https://oktelugu.com/

క్రేజీ బ్యూటీ నుండి ఇంట్రస్టింగ్ విషయాలు !

తనకూ ఫ్యాన్స్‌ ఉంటారని అసలు ఊహించలేదు అంటుంది క్రేజీ బ్యూటీ కృతీ శెట్టి. తానెప్పుడూ యాక్టింగ్‌ ను కెరీర్‌ గా ఊహించుకోలేదని, తనకు ఎప్పుడూ డాక్టర్‌ అవ్వాలని ఉండేది అని, కాకపోతే ‘ఉప్పెన’ కథ విన్నాక ఈ సినిమా చేయాలనిపించిందని అందుకే ఈ సినిమా కోసం చాల కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది కృతీ శెట్టి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ… ‘మొదటిసారి ఉప్పెన కథ విని, ఏడ్చాను. సినిమా చూసిన తర్వాత […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 10:36 am
    Follow us on

    Krithi Shetty
    తనకూ ఫ్యాన్స్‌ ఉంటారని అసలు ఊహించలేదు అంటుంది క్రేజీ బ్యూటీ కృతీ శెట్టి. తానెప్పుడూ యాక్టింగ్‌ ను కెరీర్‌ గా ఊహించుకోలేదని, తనకు ఎప్పుడూ డాక్టర్‌ అవ్వాలని ఉండేది అని, కాకపోతే ‘ఉప్పెన’ కథ విన్నాక ఈ సినిమా చేయాలనిపించిందని అందుకే ఈ సినిమా కోసం చాల కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది కృతీ శెట్టి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ… ‘మొదటిసారి ఉప్పెన కథ విని, ఏడ్చాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం నాకు ఉంది’’ అని కృతీ శెట్టి చెప్పుకొచ్చింది.

    Also Read: స్టార్ హీరోయిన్ కు అరుదైన వ్యాధి

    ఇక కృతీ శెట్టి తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. ‘మా స్వస్థలం బెంగళూరు. అయితే, నేను ముంబైలో పుట్టి, పెరిగాను. కారణం మా నాన్నగారు వ్యాపారవేత్త. అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌. అందుకే నా చిన్నతనంలోనే కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌ చేశాను. దర్శకుడు బుచ్చిబాబు నన్ను ఎక్కడో చూసి ఫోన్లో కాంటాక్ట్‌ అయ్యారు. మొదట్లో ఇప్పుడే సినిమాలు చేయను అని ఆయనకు చెప్పాను. ఎందుకంటే సైకాలజీ చదువుకుంటున్నాను. కానీ దర్శకుడు కథ చెప్పి, నన్ను ఒప్పించారు. ఇక ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్‌ చేశాను. నా కెరీర్ లో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుంది అని ఈ యంగ్ హీరోయిన్ తెలిపింది.

    Also Read: లీకుల బాధలో మహేష్ సర్కారు.. !

    అలాగే ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘దర్శకుడు బుచ్చిబాబు సహాయం చేయడం వల్లే నేను తెలుగు ఇంత త్వరగా, ఇంత బాగా నేర్చుకోగలిగాను. కానీ, ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాక్టింగ్‌ క్లాసులు ఏం తీసుకోలేదు. యాడ్స్‌ చేసిన అనుభవం నాకు బాగా ఉపయోగపడింది. ఇక నా ఈ చిన్న కెరీర్ లోనే సోషల్‌ మీడియాలో నాకు ఫ్యాన్‌ క్లబ్స్‌ ఉన్నాయని నా సన్నిహితులు చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేదు. అప్పుడు నా ఫ్యాన్స్ క్లబ్స్ ను నా ఫ్రెండ్స్ నాకు చూపించారు. షాక్ కి గురిఅయ్యాను. నాక్కూడా ఫ్యాన్స్‌ ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు. నాకు ఇది కొత్త అనుభూతిని ఇచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్