AP Government: ఏపీ ప్రభుత్వం( AP government) చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన నిర్ణయాలు వరుసగా వస్తున్నాయి. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం బోధన అన్నది అమలు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ప్రచారం చేయడం ప్రారంభించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇంగ్లీష్ మీడియం బోధనకు సంబంధించి నిర్ణయం తీసుకోగా అప్పటి విపక్షం టిడిపి వ్యతిరేకించింది. ఇప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన తప్పనిసరి చేస్తే మాత్రం అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారనుంది.
Also Read: వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే
* వైసిపి హయాంలో ఉత్తర్వులు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని భావించింది. అదే ఏడాది నవంబర్ 6న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాని ప్రవేశ పెడుతూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ నిర్ణయం పై అప్పటి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ముమ్మాటికి మాతృభాషను నిర్వీర్యం చేయడమేనని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పట్లో ఆందోళనలు కూడా చేసింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. విడతల వారీగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని చెప్పింది. దీంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది.
* వైసిపి అదేపనిగా ప్రచారం..
అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బోధన వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం దానిని తప్పనిసరి చేయనుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. నాడు జగన్మోహన్ రెడ్డి విధానాలని నేడు చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తోందని.. అందులో కొత్తదనం ఏమీ లేదని ప్రచారం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఇదే ప్రచార అస్త్రంగా మారింది. అప్పట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా అలానే ప్రచారం చేశారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిపాటి మార్పులతో ఇప్పుడు కూడా దానినే అమలు చేశారని వైసీపీ చెబుతోంది. కొత్తగా ఏం లేదని.. పాలనలో డొల్లతనం కనిపిస్తోందని.. పాత వాటిని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ వ్యంగ్యంగా.. ప్రచారం చేయడం ప్రారంభించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ప్లస్లకంటే మైనస్లు అధికం
పాఠశాల విద్యకు( School Education Department) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల నిర్ణయాలు తీసుకుంది. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలను మార్చింది. ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇవి ప్లస్ లు కాగా.. మైనస్లు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. పాఠశాలలను కుదించారు. ప్రాథమిక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. ఉపాధ్యాయుల సంఖ్యలో కోత విధించారు. ఇవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పట్లో మైనస్ గా మారాయి. ఇప్పుడు కూటమిపై బురదజల్లేందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని మూడు పార్టీల శ్రేణులు చెబుతున్నాయి.
మరో U-TURN అంటగా
పూర్తి గా ఇంగ్లీష్ మీడియం అంట గా ఇప్పుడు తెలుగు సచ్చిపోదా⁉️
ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ అంతే
జగన్ గారు ఓడిపోయినా ఆయన సెట్ చేసిన ట్రెండ్ అలాంటిది
ఫాలో అవ్వడమే వేరే గతిలేదు
మంచి ప్రభుత్వం కాదు స్టిక్కర్ల ప్రభుత్వం pic.twitter.com/1WdqvHl8Mn
— For A Reason (@FAR_IN_X) May 13, 2025