Viral Video : ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నప్పటికీ.. అందులో కొన్ని మాత్రమే విజేతలుగా నిలిచాయి. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్ లో చాలా సంవత్సరాల పాటు ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ రెండు జట్లు అధికంగా చెరి ఐదుసార్లు ఛాంపియన్లుగా అవతరించాయి. అయితే ఈసారి చెన్నైకి అలాంటి అవకాశం లేదు. ముంబై జట్టుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఇదివరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా.. అంటే దానికి జవాబు చెప్పడం కష్టం… ఇక ప్రస్తుతం ఐపీఎల్లో ట్రోఫీ సాధించే జట్ల జాబితాలో బెంగళూరు పేరు వినిపిస్తోంది. బెంగళూరు ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం బెంగళూరు ఫైనల్ దాకా వెళ్తుంది. ఈసారి ఆ జట్టుకు అభిమానుల సపోర్టు అంతకుమించి అనే రేంజ్ లో ఉంది. ప్లేయర్లు కూడా అదే స్థాయిలో ఆడుతున్నారు. మొత్తంగా చూస్తే బెంగళూరు ఫైనల్ దాకా వెళ్లడం ఖాయం అనిపిస్తోంది.
Also Read : ఐపీఎల్ రీస్టార్ట్.. పీఎస్ఎల్ పరిస్థితి ఏంటంటే?
ఫైనల్ వెళ్తే గెలిచే కప్ ఇదే
ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ విన్ కాకపోయినప్పటికీ బెంగళూరు జట్టుకు విపరీతమైన అభిమాన బలం ఉంది. బెంగళూరు జట్టు ను ఆ అభిమాన బలమే ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తోంది. అయితే బెంగళూరు అభిమానులు కొన్ని కొన్ని సందర్భాల్లో అతి పనులు చేయడం వల్ల.. అది ఆ జట్టుకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు అదే ఆ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. సోషల్ మీడియాలో బెంగళూరు జట్టును విమర్శిస్తూ రూపొందుతున్న మీమ్స్ కు అయితే లెక్కే లేకుండా పోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో మామూలుగా లేదు. బెంగళూరు జట్టును ఆ వీడియో ప్రారంభంలో ప్రస్తావించకపోయినప్పటికీ.. చివర్లో దెప్పి పొడిచిన తీరు మామూలుగా లేదు. ఓ ఐరన్ షాప్ లో పనిచేసే వ్యక్తి.. ఐపీఎల్ ట్రోఫీని పోలిన విధంగా.. ఐరన్ ట్రోఫీని తయారు చేస్తాడు. కానీ అతడు ఆ ఐరన్ ట్రోఫీనే ఈ సీజన్లో బెంగళూరు జట్టుకు ప్రదానం చేస్తారని చివర్లో షాక్ ఇస్తాడు. దీంతో బెంగళూరు అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతారు. దీనినిబట్టి ఈసారి బెంగళూరు జట్టు ఐపిఎల్ గెలిచే అవకాశం లేదని.. ఒకవేళ వారు గెలిచిన ఇచ్చేది ఐరన్ కప్ మాత్రమేనని ఆ వీడియో సారాంశం. అయితే ఈ వీడియోను గుజరాత్లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే చివర్లో ఆ కప్ ఎత్తుకునే దృశ్యాలలో వెనుక వైపు గుజరాత్ నేమ్ బోర్డులు కనిపిస్తాయి. మొత్తంగా బెంగళూరు జట్టు వరుసగా విజయాలు సాధించి.. ఫైనల్ దాకా వెళ్ళినా కప్ గెలవదని.. ఒకవేళ కప్ గెలిచినా.. అది ఉత్తి ఐరన్ మాత్రమేనని ఈ వీడియో ద్వారా మీమర్స్ నిరూపిస్తున్నారు. మరి వారి విమర్శలకు సరైన సమాధానం చెప్పాలంటే బెంగళూరు గట్టిగా ఆడాలి. ఈసారి ఛాంపియన్ గా అవతరించి.. విమర్శిస్తున్న వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలి.
View this post on Instagram