AP Dwakra: ఈ క్రమంలో డ్వాక్రా మహిళలకు రుణ వాయిదాలు మరియు పొదుపులు చెల్లింపులు వంటివి చాలా సులభతరం కానున్నాయని తెలుస్తుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 89 లక్షల డ్వాక్రా మహిళలకు రుణాలు అందించబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు ముందుకు వేయబోతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లక్షలాది డ్వాక్రా మహిళలకు చాలా ఉపయోగపడేలాగా ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను ఏపీ ప్రభుత్వం త్వరలో తీసుకొని రావడానికి రెడీ అవుతుంది. ఇకపై మహిళలు ఈ యాప్ ద్వారా తమ ఇంటి నుంచే రుణ వాయిదాలు మరియు పొదుపులు చెల్లించే అవకాశం ఉంటుంది.
Also Read: కూటమిపై విష ప్రచారం.. ప్రత్యేక బృందం వ్యూహం!
ఇకపై బ్యాంకులకు వెళ్లి క్యూలో నిలబడే అవసరం లేకుండా డ్వాక్రా మహిళలు తమ ఇంటి నుంచే మొబైల్ ఫోన్లో ఉన్న ఈ యాప్ ద్వారా కేవలం రెండు క్లిక్ తోనే లావాదేవీలను పూర్తి అయ్యేలాగా చూసుకోవచ్చు. ఇప్పటివరకు డ్వాక్రా మహిళలు ప్రతినెలా కూడా బ్యాంకులలో వాయిదాలు చెల్లించడానికి క్యూ లైన్ లలో గంటల తరబడి నిలబడటం అలాగే ప్రయాణ ఖర్చులు, ఈ సమయం వృధా కావడం వంటివి జరిగాయి.చాలామంది మహిళలు తమ పని మానుకొని ఈ వాయిదాలను చెల్లించడానికి బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నీటికి చెప్పి వాళ్లకోసం ఒక సులభతరమైన మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొని వస్తుంది. డ్వాక్రా మహిళలకు సౌకర్యవంతమైన మరియు పారదర్శకత్వం అయిన వేదికను అందించేందుకు డిజిటల్ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ను రూపొందిస్తుంది.
ఇప్పటివరకు ప్రతి నెల డ్వాక్రా సంఘాల్లో ఒక సభ్యురాలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులను వసూలు చేసి బ్యాంకులో జమ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో నగదు మాయం, లెక్కల అవకతవకలు, ఆలస్యం వంటి సమస్యలు కలుగుతున్నాయి. మరి కొన్ని సందర్భాలలో సరైన సమయానికి డబ్బులు బ్యాంకుకు చేరకపోవడం వలన ఆ మొత్తం మహిళల గురించి నష్టం కూడా వాటిల్లుతుంది. ఈ క్రమంలో త్వరలో ప్రభుత్వం తీసుకొని వస్తున్న యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీల మోసాల నివారణకే కాకుండా వాటి సమర్థతను పెంచడానికి కూడా చాలా దోహదపడతాయని తెలుస్తుంది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ వినియోగంలోనికి వచ్చిన తర్వాత నుంచి డ్వాక్రా మహిళలు తమ ఇంటి నుంచే ఈ యాప్ ద్వారా రుణాలను చెల్లించగలరు.
Also Read: విజయవాడ టు విశాఖ.. జూన్ 1 నుంచి విమాన సేవలు!