Jagan Vs Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల లేఖ విడుదల చేసిన టీడీపీ.. ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం*

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడుబోసుకున్నది తెలుగుదేశం పార్టీ. కానీ కాంగ్రెస్ బలహీన పడటంతో.. టిడిపి స్వరం మారింది. వైసీపీ రాజకీయ ప్రత్యర్థిగా మారింది. అయితే వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా భిన్న పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి.

Written By: Dharma, Updated On : October 24, 2024 10:14 am

Jagan Vs Sharmila(3)

Follow us on

Jagan Vs Sharmila: తెలుగుదేశం పార్టీ నిన్న రోజంతా ఊరించింది. సెన్సేషనల్ న్యూస్ బ్లాస్ట్ చేస్తున్నామని చెప్పి టెన్షన్ రేపింది. చివరకు పొద్దు పోయాక తన ట్విట్టర్ ఖాతాకు పని చెప్పింది. అందులో బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి దూసుకు వచ్చింది. అదే వైరల్ గా మారింది. జగన్ తో చెల్లెలు షర్మిల విభేదిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వ్యక్తిగత వైరం కాస్త రాజకీయ వైరంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో జగన్ కు అదే నష్టం చేసింది. అయితే జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారని టిడిపి అనుకూల మీడియాలో కథనం వచ్చింది. అయితే అది అలానే కొనసాగుతుండగా… జగన్ తన కంపెనీలో షేర్స్ విషయంలో ఏకంగా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విశేషం. గతంలో తాను ఏర్పాటు చేసిన కంపెనీలో షేర్ హోల్డర్స్ గా తన తల్లి, చెల్లి ఉన్నారని.. ఇటీవల నిబంధనలకు వ్యతిరేకంగా తన పేరిట ఉన్న షేర్స్ ను తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిలకు బదలాయించారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. దీంతో టీడీపీ అనుకూల మీడియాకు ఇది ప్రధాన కథనంగా మారిపోయింది. ఒకవైపు మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తుండగా.. టిడిపి ఈ విషయంలో సంచలన ప్రకటన విడుదల చేస్తామని చెప్పింది. దీంతో అందరి దృష్టి టిడిపి సోషల్ మీడియా పై పడింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక లేఖ వెలుగు చూసింది. సెప్టెంబర్ 12న తనను సోదరుడు జగన్ ఎలా మోసం చేశారో వివరిస్తూ షర్మిల రాసిన లేఖను టిడిపి సంపాదించింది. అదే లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

* అనేక ప్రశ్నలు
డియర్ జగనన్న అంటూ సంబోధిస్తూనే.. అనేక ప్రశ్నలు సంధించారు షర్మిల. వాటిని ఒక్కో దానిని ట్విట్ చేస్తూ సైకో జగన్ తల్లిని, చెల్లెలిని ఎలా మోసం చేశారు అని టిడిపి విమర్శలు చేసింది. ఏపీ సమాజానికి జగన్ ప్రమాదం అంటూ హెచ్చరించింది. ప్రధానంగా ఈ లేఖలో షర్మిల ఆస్తి వివరాలను ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి తన నలుగురు మనవలకు సరి సమానంగా ఇవ్వాలని పరితపించారని.. తండ్రి బతికున్న సమయంలో ఈ ఒప్పందాన్ని జగన్ అంగీకరించారని.. మరణం తరువాత మాట మార్చారు అన్నది షర్మిల చేసిన ఆరోపణ. వైయస్సార్ కుటుంబ వనరులుగా సంపాదించిన ఆస్తుల్లో సాక్షి మీడియా, భారతి సిమెంట్, సరస్వతీ పవర్ ప్లాంట్ వంటి ఉన్నాయని పేర్కొన్నారు.

* హైలెట్ చేస్తున్న టిడిపి
అయితే షర్మిల లేవనెత్తిన ప్రశ్నలను టిడిపి హైలెట్ చేస్తోంది. సొంత చెల్లెలిని ఎలా మోసం చేశారో వివరించే ప్రయత్నం చేసింది.అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల రాసిన లేఖను.. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేయడం అనేది ప్రాధాన్యత అంశంగా మారిపోయింది.కేవలం రాజకీయం కోసమే ఈ లేఖను టిడిపి వాడుకుంటుందని వైసిపి ఆరోపిస్తోంది.కానీ జగన్ వ్యక్తిత్వం ఏపీ సమాజానికి తెలియాలి కదా అని టిడిపి సమర్ధించుకుంటుంది. మొత్తానికి అయితే జగన్ ఓడిపోయిన షర్మిల మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నారు.