https://oktelugu.com/

TDP Vs YCP: కొద్ది గంటల్లో బిగ్ బ్లాస్ట్.. టిడిపి, వైసిపి ఏం చెప్పబోతున్నాయి? ఏపీలో ఉత్కంఠ తారాస్థాయికి..

సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. సంచలనాలకు కొదువ లేకుండా పోతోంది. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ సెన్సేషన్ గా మారుతోంది.అయితే తాజాగా టిడిపి, వైసీపీ సోషల్ మీడియాలు చేసిన ప్రకటన మాత్రం సంచలనం రేపుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 24, 2024 / 10:30 AM IST

    TDP Vs YCP

    Follow us on

    TDP Vs YCP: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుంది? ఏపీలో అధికార,విపక్షాలు ఏం చెప్పబోతున్నాయి? కేవలం ట్విట్టర్ వార్ మాత్రమేనా? లేకుంటే బిగ్ బ్లాస్టింగ్ ఏమైనా జరగబోతోందా? అసలు టిడిపి, వైసీపీలు ట్విట్టర్లో పెట్టిన పోటాపోటీ పోస్టర్ల వెనుక అసలు రహస్యం ఏంటి? ఇప్పుడు ఏపీలో ఇదే హార్ట్ టాపిక్ అయింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అధికార విపక్షాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులకు హద్దులు కూడా ఉండడం లేదు. తాజాగా రెండు పార్టీల మధ్య పోస్టర్ల యుద్ధం ప్రారంభమైంది. టిడిపి, వైసిపి పెట్టిన పోస్టర్స్ చర్చకు దారితీస్తున్నాయి. తొలుత టిడిపి తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ ప్లోజ్.. చూస్తూనే ఉండాలంటూ అందులో పేర్కొంది. అయితే ఈ పోస్టర్కు కౌంటర్ గా వైసీపీ కూడా బిగ్ రివిల్.. ట్రూత్ బాంబు డ్రాపింగ్ అని పోస్టర్ విడుదల చేసింది. దీంతో ఏపీలో ఏం జరగబోతోంది? అనేది ప్రజల్లో తీవ్రమైన ఆసక్తికి దారితీసింది.

    * ఆసక్తికర చర్చ
    అయితే ఈ పోస్టర్ వార్ వెనుక ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది జస్ట్ సోషల్ మీడియా వారు అంటూ తేలిగ్గా తీసుకున్నారు. అయితే తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. సీరియస్ మేటర్ ఉంటుందన్న వారు ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి లీకులు రాకపోవడంతో ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం ఆందోళన చెందుతున్నాయి. ఏంటి మేటర్ అని ఆరా తీస్తున్నాయి. కానీ విషయం మాత్రం బయటకు రావడం లేదు. ఏదైనా తెలియాలంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల దాకా ఆగాల్సిందే.

    * రెండు పార్టీల విభాగాలు యాక్టివ్
    ఇటీవల సోషల్ మీడియా యాక్టివ్ కావాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి.. ప్రభుత్వంపై పోరాటం చేసిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో వైసిపి సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయ్యింది. అదే సమయంలో టిడిపి అనుకూల సోషల్ మీడియా సైతం చాలా ఫాస్ట్ గా ఉంది. ఈ తరుణంలోనే రెండు పార్టీల మధ్య ఈ పోస్టర్ వార్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.