ETV Prabhakar: ఎన్టీఆర్ వల్ల భారీగా నష్టపోయాం.. కోలుకోలేని దెబ్బ కొట్టాడు అంటూ ఈటీవీ ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్!

చిరంజీవి, నాగార్జున కొడుకులు కూడా ఈ స్థాయి యాటిట్యూడ్ చూపలేదు, ఇండస్ట్రీ లోకి వచ్చే అబ్బాయికి ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అంటూ చంద్రహాస్ పై నెటిజెన్స్ మండిపడ్డారు. అయితే చంద్రహాస్ దానిని పాజిటివ్ గా తీసుకొని తన పేరు ముందు 'యాటిట్యూడ్ స్టార్' అని పెట్టుకున్నాడు. ఇది కూడా ట్రోల్ స్టఫ్ అయ్యింది.

Written By: Vicky, Updated On : October 24, 2024 10:06 am

ETV Prabhakar

Follow us on

ETV Prabhakar: టీవీ షోస్ లో ఒక యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత సీరియల్స్ లో హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఇలా అన్ని యాంగిల్స్ ని కవర్ చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకొని బుల్లితెర మెగాస్టార్ గా ప్రభాకర్ నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రభాకర్. ఈయనకి సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది కానీ, బుల్లితెర మీద వచ్చినంత గుర్తింపు మాత్రం రాలేదు అనే చెప్పాలి. అయితే ఈయన కొడుకు చంద్ర హాస్ సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా లాంచ్ సమయంలో ఈ కుర్రాడి ప్రవర్తన, నిలబడిన తీరు, వంకర చూపులు ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.

చిరంజీవి, నాగార్జున కొడుకులు కూడా ఈ స్థాయి యాటిట్యూడ్ చూపలేదు, ఇండస్ట్రీ లోకి వచ్చే అబ్బాయికి ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అంటూ చంద్రహాస్ పై నెటిజెన్స్ మండిపడ్డారు. అయితే చంద్రహాస్ దానిని పాజిటివ్ గా తీసుకొని తన పేరు ముందు ‘యాటిట్యూడ్ స్టార్’ అని పెట్టుకున్నాడు. ఇది కూడా ట్రోల్ స్టఫ్ అయ్యింది. ఆయన హీరోగా నటించిన ‘రామ్ నగర్ బన్నీ’ చిత్రం ఇటీవలే విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాని ప్రభాకర్ తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. అయితే ఈ సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో రీసెంట్ గా ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నా కొడుకుకి హీరో అవ్వాలనే కోరిక ఉండేది. వాడి కోరికని అర్థం చేసుకొని యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పించి ఒక కమర్షియల్ హీరో ఎలా ఉండాలో, అలా తయారు చేసాము. మావాడిని లాంచ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు, వాటిలోని టాలెంట్ ని గమనించి అనేకమంది నిర్మాతలు వాడితో సినిమాలను నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఇద్దరు నిర్మాతలతో రెండు సినిమాలు కూడా చేసాడు.

అయితే అవి మా వాడి టాలెంట్ ని పూర్తిగా బయటపెట్టే సినిమాలు అనిపించకపోవడంతో, ‘రామ్ నగర్ బన్నీ’ లాంటి కమర్షియల్ సబ్జెక్టు ని ఎంచుకొని సినిమా తీసాము. ముందుగా ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు మూడు కోట్ల రూపాయిలు అవుతుందని అనుకున్నాము. కానీ ఈ చిత్రం పూర్తి అయ్యేసరికి 5 కోట్లు ఖర్చు అయ్యింది. ఎక్కువ ఖర్చు అయ్యింది అనే బాధ మాలో కలగలేదు. ఎందుకంటే సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది, కలెక్షన్స్ భారీగా వస్తాయి అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదల అయ్యాక పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ‘దేవర’ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం, ఆ సినిమాకి జనాలు బ్రహ్మరథం పట్టడంతో దాని ప్రభావం మా సినిమా మీద పడింది. దీంతో కోట్ల రూపాయిల నష్టాన్ని చూడాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాకర్.