AP Budget 2025: ఏపీ అసెంబ్లీలో( AP assembly) బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్( paiyavula Keshav ) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు లక్షల 23 కోట్ల అంచనాలతో బడ్జెట్ను ప్రతిపాదించారు. అందులో రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లుగా వేశారు. అదేవిధంగా రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు కాగా.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లుగా పేర్కొన్నారు. మూల ధన వ్యయం రూ. 40,635 కోట్లుగా అంచనా వేశారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిచ్చారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్న శాఖలకు అధిక కేటాయింపులు చేశారు. నారా లోకేష్ శాఖలకు సైతం ప్రాధాన్యమిచ్చారు.
Also Read: వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సరికొత్త ఫైర్ బ్రాండ్ ఆమె!
* గ్రామీణాభివృద్ధికి నిధులు..
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) 5 మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఏపీకి కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్నారు. అయితే పవన్ నిర్వర్తిస్తున్న గ్రామీణాభివృద్ధి- పంచాయతీరాజ్ శాఖ కోసం బడ్జెట్లో రూ.18,847 కోట్లు ప్రతిపాదించారు. కేంద్రం నుంచి ఈ శాఖల కోసం వస్తున్న సహకారం గురించి కూడా మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాల్లో వస్తున్న మార్పులను కూడా ప్రస్తావించారు. గత కొంతకాలంగా గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను నేరుగా ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులను సైతం పంచాయితీలుకే కేటాయిస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పుకొచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్.
* విద్యా శాఖకు కేటాయింపులు
మరోవైపు నారా లోకేష్ ( Nara Lokesh) నిర్వర్తిస్తున్న శాఖలకు సైతం అధిక నిధులు కేటాయించారు. విద్యా శాఖకు ఏకంగా రూ. 31,805 ఓట్లు ప్రతిపాదించారు. ఉన్నత విద్య కోసం రూ. 2,506 కోట్లను కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యాశాఖ పరిధిలోనే తల్లికి వందనం పథకం అమలు కోసం ఏకంగా రూ. 9,407 కోట్లను బడ్జెట్ కేటాయింపులు చేశారు.
* సీఎం తర్వాత వారిద్దరే..
అయితే సీఎం చంద్రబాబు( CM Chandrababu) తర్వాత మంత్రివర్గంలో ఈ ఇద్దరు నేతలు కీలకంగా ఉన్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటు లోకేష్ సైతం అదే స్థాయిలో కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో మంత్రులుగా తమ ముద్ర చాటుకోవాల్సి ఉంటుంది. అందుకే వారికి అధిక కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఒకవైపు గ్రామీణ అభివృద్ధికి పెద్ద పీట వేస్తూనే.. మరోవైపు విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పవన్ నిర్వర్తిస్తున్న గ్రామీణాభివృద్ధికి.. లోకేష్ నిర్వర్తిస్తున్న విద్యా శాఖకు అధిక కేటాయింపులు చేసినట్లు సమాచారం.
Also Read: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీకు షాక్.. ఇక ఆ సీట్లనీ మనకే!