Non Local Quota
Non Local Quota: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా.. ప్రాధాన్యత దక్కేలా.. ఏపీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇంజినీరింగ్(Engineering)తోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో అమలవుతున్న 15 శాతం నాన్ లోకల్ కోటా(అన్ రిజర్వుడు)లో వచ్చే విద్యా సంవత్సరం(2025–26) నుంచి అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇకపై ఆ సీట్లకు ఆధ్రప్రదేశ్(AndhraPradesh) విద్యార్థులు పోటీ పడే అవకాం లేకుండా చేశారు. ఈమేరకు పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా జీవో జారీ చేశారు. 15 శాతం అన్ రిజర్వుడు కోటాకు అర్హులు ఎవరనేది స్పష్టత ఇస్తూ జీవో ఇచ్చారు.
Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?
2024 వరకు ఇలా..
రాష్ట్ర విభజన సమయంలో విద్యాసంస్థల్లో పదేళ్లపాటు 15 శాతం నాన్‌లోక్ కోటా అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. 2024 వరకు 15 శాతం నాన్‌లోకల్ కోటారు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ(Telangana) విద్యార్థులు పోటీ పడేవారు. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు 2024తో పూర్తయింది. ఈ నేపథ్యంలో 15 శాతం నాన్‌లోకల్ కోటాలో ఏపీ విద్యార్థులు పోటీ పడే గడువు ముగిసింది. అయితే వాస్తవానికి గత విద్యాసంవత్సరం నుంచే 15 శాతం కోటా రద్దు అమలు చేయాలి. కానీ కొన్ని కారణాలతో నాన్‌లోకల్ కోటా అమలు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్‌లైన్స్(Admission Guidlaince)లో సవరణ చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకాం గతంలో మాదిరిగానే కన్వీనర్ కోటా 70 శాతం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు అంటే ఓయూ రీజియన్(తెలంగాణ రాష్ట్ర పరిధి) అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం స్థానికేతర కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74 ప్రకారం నాన్ లోకల్ కోటాకు ఓయూ రీజయన్‌తోపాటు ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University), శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ(Srikrishna Devaraya University) పరిధిలోని విద్యార్థులు పోటీ పడవచ్చు. అయితే తాజా జీవోలో ఏయూ, ఎస్‌కేయూలను తొలగించింది. ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఎవరు అర్హులంటే:
తాజా సవరణ ప్రకారం.. అన్ రిజర్వుడ్‌గా పలిచే స్థానికేతర కోటా 15 శాతానికి రాష్ట్రంలో చదివిన స్థానిక పిల్లలతోపాటు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివాసం ఉన్నవారు మాత్రమే అర్హులు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగం సంస్థల్లో, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఇతర రాస్ట్రాల వారి పిల్లలు పోటీ పడే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరగం సంస్థల్లో, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారి జీవిత భాగస్వాములు ఉంటే వారి పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో పదేళ్లుగా నివసిస్తున్నట్లు మీసేవ కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాలి.
వీటికి ఇవే నిబంధనలు..
ఇంజినీరింగ్‌తోపాటు, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మాడీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్‌తోపాటు పీజీ సీట్ల భర్తీకి ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
స్థానికత ఇలా..
స్థానికతను గుర్తించేందుకు తెలంగాణలో గతంలో మాదిరిగానే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. బీటెక్, బీఫార్మసీ, బీఎస్‌సీ అగ్రికల్చర్, బీఎస్‌సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు. 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదవకుంటే.. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు.. ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు తెలంగాణ రాష్ట్రంలో చదవాలి. ఇంజినీరింగ్, ఇతర కోర్సుల సీట్ల భర్తీ సమయంలో కన్వీనర్ కోటాలో తొలుత 15 శాతం అన్ రిజర్వుడ్ (నాన్ లోకల్) సీట్లను భర్తీ చేస్తారు. దీనిలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తారు. తాజా సవరణల నేపథ్యంలో ఏటా నాన్‌లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సుమారు 60 వేల మందికిపైగా కన్వీనర్ సీట్లు పొందుతారు.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Sensational decision of telangana government lifting of non local quota
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com