Varudu Kalyani: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చాలామంది మహిళా నేతలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గట్టి వాయిస్ వినిపిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో చాలామంది సైలెంట్ అయ్యారు. పార్టీలో పదవులు అనుభవించిన వారు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతల వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. అప్పుడప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా వాయిస్ వీడియోలు విడుదల చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో ఉత్తరాంధ్ర మహిళా నేత ఫైర్ బ్రాండ్ గా మారారు. శాసనమండలిలో కూటమి ప్రభుత్వానికి చెడుగుడు ఆడేశారు.
Also Read: నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ ఎంపీ.. రెడ్ బుక్ లో ఉన్నది ఆయన పేరే?
* ఎంతోమంది మహిళా నేతలు ఉన్నా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా నేతలకు ( lady leaders) కొదువ లేదు. అటు జగన్మోహన్ రెడ్డి సైతం చాలామంది మహిళా నేతలకు ప్రాధాన్యమిచ్చారు. కొందరికి అనూహ్య అవకాశాలు కల్పించారు. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజా, తానేటి వనిత, విడదల రజిని మేకతోటి సుచరిత, ఉషశ్రీ చరణ్, వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికి అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇందులో చాలామంది పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నవారు సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ వాయిస్ వినిపించే మహిళా నేతలు కరువు అయ్యారు. ఇటువంటి సమయంలోనే నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు వరుదు కళ్యాణి. చాలా పద్ధతిగా మాట్లాడుతూ, విధానపరమైన లోపాలను చూపిస్తూ తనదైన శైలిలో గళం విప్పుతున్నారు వరుదు కళ్యాణి.
* నిన్నటి వరకు సామాన్య ఎమ్మెల్సీగా..
నిన్నటి వరకు వరుదు కళ్యాణి ( Varudu Kalyani) అంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే. 38 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల్లో ఆమె ఒక సాధారణ నేత. అయితే నిన్న శాసనమండలిలో నిర్మాణాత్మకమైన చర్చల్లో ఆమె వాయిస్ బలంగా వినిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇంత మంచి నేతలు ఉన్నారా? ఇన్ని రోజులు వారి సేవలను ఎందుకు వినియోగించుకోలేదు? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. శాసన మండలి లో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా సీనియర్ నేత బొత్స ఉన్నారు. కానీ ఆయనకు మించి వాగ్దాటితో వరుదు కళ్యాణి అందర్నీ ఆకట్టుకున్నారు.
* స్థానిక సంస్థల ప్రతినిధిగా..
శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam district ) చెందిన వరుదు కళ్యాణి పుట్టింటి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. చిన్న వయసులోనే ఆమె స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యారు. సమకాలీన రాజకీయ అంశాలపై ఆమెకు సమగ్ర అవగాహన ఉంది. అయితే గత ఐదేళ్లలో దూకుడు కలిగిన మహిళ నేతలను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు. దీంతో బలమైన వాయిస్ ఉన్న, సిద్ధాంత పరంగా మాట్లాడే చాలామంది నేతలు మరుగున పడిపోయారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొద్దిమంది నేతల్లో.. మంచి వాయిస్ ఉన్న నేతలు బయటపడుతుండడం విశేషం. పార్టీ నుంచి ఎంతమంది నేతలు బయటకు వెళ్లి పోయినా పర్వాలేదు. ఇటువంటి వాయిస్ ఉన్న నేతలను వినియోగించుకుంటే పార్టీకి ఎంతో ప్రయోజనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో