AP Government News : రబీలో( Rabhi season) భాగంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఏపీలో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో రబీకి ఇబ్బందులు తప్పలేదు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. రబీ పంతకాలంలో ఆరు జిల్లాల పరిధిలోని 51 కరువు మండలాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మద్యస్థంగా కరువు ప్రభావం ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో కరువు ప్రభావం అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కరువు మండలాల్లో ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలే ఉన్నాయి. రాయలసీమలో రబీలో ప్రధాన పంటలు పండిస్తుంటారు. కానీ వర్షాభావ పరిస్థితులు ఎదురు కావడంతో ఈ ఏడాది కరువు తప్పడం లేదు. అయితే కరువు బాధ్యత ప్రాంతాల్లో రైతులకు రుణ సౌకర్యం పొందే విధానానికి జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : మూడో విడత నామినేటెడ్ పదవులు రెడీ.. ఈసారి వారికి లేనట్టే!
* మొత్తం 51 మండలాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా( state wide) రబీలో 51 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. వీటిలో 37 మండలాల్లో తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించింది. 14 మండలాల్లో మాత్రం సాధారణ కరువు ఉన్నట్లు తెలిపింది. కరువు మండలాల పై రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో కరువు ప్రభావ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల నివేదికలను కమిటీ పరిశీలించింది. వర్షపాతం లోటు, పంట నష్టం, భూగర్భ జలాల స్థాయి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా తెలిపారు. అన్ని నివేదికలు పరిశీలించిన తరువాత కరువు మండలాలను ప్రకటించినట్లు కూడా పేర్కొన్నారు.
* తీవ్ర కరువు ఈ మండలాల్లోనే..
తాజాగా ప్రకటించిన జాబితాలో.. తీవ్ర కరువు మండలాల్లో నంద్యాల జిల్లాలోని( Nandyala district ) కొలిమిగుండ్ల, కర్నూలు జిల్లాలో అస్పిరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికేర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో రొద్దం, అనంతపురం జిల్లాలో బెలుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాడికి మండలాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి పుల్లలచెరువు, దాన కొండ, కురిచేడు, మర్రిపూడి, కంభం, తర్లపాడు, పెద్దరవీడు, సంతనూతలపాడు, ఒంగోలు, వెలిగండ్ల, బెస్తవారిపేట లో ఉన్నాయి. కడప జిల్లాకు సంబంధించి దువ్వూరు, మైదకూరు, బ్రహ్మంగారిమఠం, కాశీ నాయన, కాజీపేట, చాపాడు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు ఉన్నాయి.
* సాధారణ కరువు మండలాల జాబితా
సాధారణ కరువు మండలాలకు సంబంధించి కర్నూలు జిల్లా( Kurnool district) పత్తికొండ, అనంతపురం జిల్లా విడపనకల్లు, కడప జిల్లా మైలవరం, సత్యసాయి జిల్లా తనకల్లు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో బేతంచెర్ల, బనగానపల్లి, సంజామల, ఉయ్యాలవాడ, ప్రకాశం జిల్లాలో కొనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, చంద్రశేఖరపురం, పామూరు, రాచర్ల ఉన్నాయి. ఈ మండలాల రైతులకు సంబంధించి రుణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు సహాయం అందించాలని సూచించింది.
Also Read : ఏపీకి చల్లటి కబురు.. ఆ రెండు ప్రాంతాల్లో వర్షాలు!