Horticultural Farmers: తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన పంటల రైతులకు ఒక భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ఉన్న ఉద్యాన పంటల రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక భారీ శుభవార్త తెలిపింది. ప్రభుత్వం రైతులకు పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు వారికి ఉపాధి హామీ పథకం కింద 100% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇకపై ఉచితంగా పండ్ల మొక్కలు పొందడంతో పాటు సాగు సంబంధిత ఖర్చులను కూడా ప్రభుత్వం భరించని ఉందని తెలుస్తుంది. ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ తాజాగా ప్రభుత్వం 100% రాయితీ కల్పించబోతున్నట్లు శుభవార్త తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వం మామిడి తోటల సాగును ప్రోత్సహించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మామిడి తోటల సాగుకు ఒక ఎకరాకు రూ.13,300 నుంచి రూ.50,000 రాయితీ పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం చేకూరనుందని తెలుస్తుంది.
Also Read: “బియ్యం” మంత్రిగారి పదవికి ఎసరు పెట్టింది..
అలాగే ప్రభుత్వం ఈ పంటల సాగుకు రానున్న మూడేళ్ల పాటు సాగుకు అయ్యే ఖర్చులు, నీటి సరఫరా వీటితో పాటు పురుగుల మందులు, ఎరువులకు అయ్యే ఖర్చును కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించనుందని తెలుస్తుంది. ఉద్యానవన పంటల సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం చాలా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్ల తోటలను సాగు చేసే రైతులు ఆర్థిక భారం లేకుండా మెరుగైన పొందవచ్చు.
అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు సంబంధించి అనేక పథకాలను అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక తాజాగా కూడా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పండ్ల తోటలను సాగు చేసే రైతుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఆర్థిక భారం తగ్గనుంది.