HomeNewsChina hair regrowth electric comb: బట్టతలపై జుట్టు.. చైనా శాస్త్రవేత్తల కరెంటు దువ్వెన ఎలా...

China hair regrowth electric comb: బట్టతలపై జుట్టు.. చైనా శాస్త్రవేత్తల కరెంటు దువ్వెన ఎలా పనిచేస్తుందంటే..

China hair regrowth electric comb: బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త. జుట్టు రాలిపోవడం.. తిరిగి పెరగకపోవడం అంటే సమస్యలకు పరిష్కారం కనుగొన్నదిశగా చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. సాధారణ దువ్వెన మాదిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ దువ్వెనను అభివృద్ధి చేశారు. దీనిని ఉపయోగించడం ద్వారా జుట్టు కుదుళ్ళ కు విద్యుత్ ప్రేరణ అందించడంతోపాటు.. ఔషధాలను నేరుగా హెయిర్ పాలికల్స్ లోకి పంపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరానికి డిటాంగిల్ (Detangle) అనే […]

China hair regrowth electric comb: బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త. జుట్టు రాలిపోవడం.. తిరిగి పెరగకపోవడం అంటే సమస్యలకు పరిష్కారం కనుగొన్నదిశగా చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. సాధారణ దువ్వెన మాదిరిగా కనిపించే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ దువ్వెనను అభివృద్ధి చేశారు. దీనిని ఉపయోగించడం ద్వారా జుట్టు కుదుళ్ళ కు విద్యుత్ ప్రేరణ అందించడంతోపాటు.. ఔషధాలను నేరుగా హెయిర్ పాలికల్స్ లోకి పంపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరానికి డిటాంగిల్ (Detangle) అనే పేరు పెట్టారు. ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాలలో మంచి ఫలితాలు వచ్చాయి..

ఎలా పనిచేస్తుందంటే

మనం ఉపయోగించే దువ్వెనకు.. ఈ ప్రత్యేకమైన దువ్వెనకు చాలా తేడా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ పళ్ళు.. ప్రత్యేకమైన ఎలక్ట్రోడ్లు.. ఔషధాలను నిల్వచేసే చిన్న మాడ్యూల్స్ ఉంటాయి. ఈ దువ్వెనతో జుట్టును దువ్వుతున్నప్పుడు తక్కువ స్థాయి విద్యుత్ క్షేత్రం ఉత్పత్తి అవుతుంది. ఇది తల చర్మం మీద పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లలో లోతైన ప్రాంతాలకు చేరుకుంటుంది. తలమీద పూర్ణ చర్మం మీద ఔషధాలను పూసినప్పుడు పోలిస్తే ఈ సాంకేతికత ద్వారా ఔషధాలను పాలికల్స్ ప్రాంతానికి 9 రెట్లు ఎక్కువ లోతు వరకు చేర్చే సామర్థ్యం కనిపించింది.

ఈ దువ్వెనలో ప్రధానంగా రెండు విధాలుగా ఈ సాంకేతికత పనిచేస్తుంది. ప్రత్యేక ఎలక్ట్రోడ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ క్షేత్రం జుట్టుకు కుదురులపై ప్రభావం చూపుతుంది. తద్వారా హెయిర్ ఫాలికల్స్ లో కణాల కార్యకలాపాలను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తారు. ఈ దువ్వెనలో ప్రత్యేక ఔషధ మాడ్యూల్స్ ఉంటాయి. వీటి ద్వారా VEGFA అనే ప్రోటీన్ ఉత్పత్తికి సంబంధించిన జన్యుపదార్థాన్ని.. అలాగే 5- ఆల్ఫా రేడక్టేజ్ (5 Alpha reductase) ను లక్ష్యంగా చేసుకునే si RNA ను హెయిర్ ఫాలికల్స్ లోకి పంపిస్తారు.

VEGFA రక్తనాళాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల జుట్టుకు కుదురులకు రక్త సరఫరా మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరోవైపు 5 ఆల్ఫా రేడక్టేజ్ -2 కార్యకలాపాలను తగ్గించడం ద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల ప్రభావాన్ని నియంత్రించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిశుద్ధులలో భాగంగా శాస్త్రవేత్తలు ఏరుకుల మీద ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో డిటాంగిల్ దువ్వెనను ఉపయోగించిన ఎలుకల్లో 28 రోజుల్లో 100% వరకు జుట్టు కవరేజ్ కనిపించింది. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ఉపయోగించే మినాక్సిడిల్ (Minoxidil) తో పోల్చినప్పుడు ఈ దువ్వెన ఉపయోగించిన ఎలుకల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయి. మినాక్సిడిల్ తో పోల్చినప్పుడు ఈ దువ్వెన ఉపయోగించిన ఎలుకల్లో జుట్టు కవరేజ్ సుమారు 70% గా ఉంది. ప్రయోగాత్మకంగా ఈ కొత్త సాంకేతికత మెరుగైన ఫలితాలను చూపించింది.

ప్రసాదం చాలామంది పురుషులు.. మహిళలు జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. జన్యుపరమైన కారణాలు.. హార్మోన్ల ప్రభావం ఇతర అనారోగ్య సమస్యల వల్ల జుట్టు పలుచగా మారుతుంది. ఇప్పటివరకు అనేక రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఫినాప్తరాయిడ్.. మినాక్సిడైల్ వంటి మందులు ప్రత్యేకమైనవి. అయితే ఈ మందులను వైద్యుల సూచనల ప్రకారమే ఉపయోగించాలి. కొత్తగా అభివృద్ధిచేసిన డిటాంగిల్ దువ్వెన మాత్రం ఔషధాలను నేరుగా జుట్టు కుదురులకు చేరవేసే విధానం ప్రత్యేకంగా ఉంది. అయితే ఈ పరికరం మనుషుల మీద ఏ స్థాయిలో పనిచేస్తుంది.. ఫలితాలు ఎలా ఉంటాయి.. దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి.. అనే విషయాల మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

చైనాలోని బీహాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వివరాలను ఇటీవల బయటపెట్టారు. తద్వారా జుట్టు రాల సమస్యకు బయో ఎలక్ట్రానిక్ సాంకేతికతను ఉపయోగించే దిశగా ఒక ఆసక్తికరమైన పరిశోధన తెరమీదకి వచ్చిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper