Homeఆంధ్రప్రదేశ్‌Jagan credit controversy: స్టాలిన్ తో బంధం.. విజయ్ తో ప్రాణ స్నేహం.. జగన్ క్రెడిట్...

Jagan credit controversy: స్టాలిన్ తో బంధం.. విజయ్ తో ప్రాణ స్నేహం.. జగన్ క్రెడిట్ చోరీ

Jagan credit controversy: తమిళనాడులో( Tamil Nadu ) టీవీకె విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. విజయ్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణ స్నేహితుడు అన్నట్టు ప్రచారం చేస్తోంది. కానీ జగన్ రాజకీయాల గురించి ప్రజలకు తెలుసు. పైగా ఆయనకు స్టాలిన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ వేడుకలకు పరస్పరం ఆహ్వానించుకునేవారు ఆ ఇద్దరు. అయితే ఇప్పుడు దానిని దాచి పెట్టి విజయ్ తో […]

Jagan credit controversy: తమిళనాడులో( Tamil Nadu ) టీవీకె విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. విజయ్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణ స్నేహితుడు అన్నట్టు ప్రచారం చేస్తోంది. కానీ జగన్ రాజకీయాల గురించి ప్రజలకు తెలుసు. పైగా ఆయనకు స్టాలిన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ వేడుకలకు పరస్పరం ఆహ్వానించుకునేవారు ఆ ఇద్దరు. అయితే ఇప్పుడు దానిని దాచి పెట్టి విజయ్ తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధాన్ని బయటపెట్టి.. తమిళనాడు విజయంతో సంబరాలు చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయత్నంలో ఉండగానే ఇప్పుడు రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్ ఒక్కటే అన్నట్టు ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇద్దరూ ఒకే మాదిరిగా పాలన అందించారని తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిని స్టాలిన్ తో పోల్చారు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి. ఇప్పుడు మాత్రం విజయ్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణ స్నేహితుడు అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.

ఎలివేషన్ కోసం..
స్టాలిన్ ( Stalin)విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే విజయ్ ఎప్పుడు ప్రాణ స్నేహితుడు అయ్యాడో మాత్రం చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే విజయను తమిళనాడు ప్రజలు ఆదరించారు అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎలివేట్ చేస్తున్నారు. ఒకానొక దశలో ఏపీలో కనిపించని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు వెతుక్కుని మరి విజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిని బట్టి అర్థమవుతోంది తమిళనాడులో విజయం లో క్రెడిట్ కోసం వైసీపీ ఎంత ఆరాటపడుతుందో. వాస్తవానికి ఇదే సోషల్ మీడియాను నమ్ముకొని డీఎంకే ఘోరంగా ఓడిపోయింది. దాని పర్యవసానాలు కూడా ఆలోచించకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలివేషన్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పరుస్తోంది.

అచ్చం ఏపీ మాదిరిగా..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి పనిచేసిన దాని వెనుక ఉన్న క్రెడిట్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉండేది. అనేక సందర్భాల్లో ఇది వికటిస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్రంలో విజయంలో క్రెడిట్ కోసం ఆరాటపడుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఆ పార్టీకి అది నష్టం. ఏపీలో గెలవలేని వారు తమిళనాడులో విజయ్ ను గెలిపించారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ పెట్టి లేపుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులు. పోనీ ఎలాగో ప్రజలను నమ్మిద్దాము అంటే.. డీఎంకే గెలుస్తుందని భావించి రోజా నోటికి వచ్చిన విధంగా మాట్లాడారు. పైగా జగన్మోహన్ రెడ్డితో స్టాలిన్ ను పోల్చారు. అందుకే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోజా మీద గరం అవుతున్నాయి. పార్టీని ఇరకాటంలో పెట్టిన రోజా పై రుసరసలాడుతున్నాయి. అటు రాజకీయ ప్రత్యర్థులు చేసే సోషల్ మీడియా ప్రచారానికి ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు రోజా. సొంత పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసేసరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట రోజా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper