1983 Plane Crash Recall: ఇటీవల అహ్మదాబాద్ లో( Ahmedabad) విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన విమాన ప్రమాదాలపై రకరకాల కథనాలు వచ్చాయి. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం ఇవి వైరల్ అయ్యాయి. అయితే 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక విమాన ప్రమాదం జరిగింది. తెలుగు సినీ ప్రముఖులు పదుల సంఖ్యలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా ఉండడం విశేషం. తిరుపతి జిల్లాకు చెందిన ఓ న్యూస్ ఛానల్ జర్నలిస్టు ఈ ప్రమాదం గురించి.. నాడు జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న సినీ ప్రముఖులు ఆ గ్రామానికి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చకపోవడం గమనార్హం. తిరుపతికి చెందిన జర్నలిస్ట్ కార్తిక్ అప్పటి ప్రమాద పరిస్థితులు, నాడు ఆ గ్రామ పెద్దలను పలకరించి.. వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఒక కథనాన్ని రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సరిగ్గా 32 ఏళ్ల కిందట..
1993లో తిరుపతి( Tirupati) సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా గుండ్లపల్లి సమీపంలో ఓ విమానం ఆకాశం నుంచి నేలకు ఒరిగింది. చెన్నైలో 272 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. ఉదయం 6:20 గంటలకు చెన్నైలో బయలుదేరిన ఈ విమానం ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ విమానం కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతున్న క్రమంలో ఎయిర్పోర్ట్లో దట్టంగా మంచు కమ్ముకుంది. రన్ వే కనిపించకపోవడంతో మళ్లీ ఆ విమానాన్ని.. మద్రాస్ కు తీసుకెళ్తున్నట్లు వారు తెలిపారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా విమానం తక్కువ వేగంతో.. తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో విమానంలో ఇంధనం తగ్గిపోయింది. మద్రాస్ కు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో ఇంధనం అయిపోవడంతో.. తిరుపతి విమానాశ్రయానికి 14 నాటికల్ మైళ్ల దూరంలో ఒక పొలంలో బెల్లీ లాండింగ్ చేయాల్సి వచ్చింది.
Also Read: Plane Crash Latest Update: కుప్ప కూలిన విమానం.. అందులో 155 మంది సేఫ్.. అద్భుతం జరిగింది ఇలా
60 మందికి పైగా సినీ ప్రముఖులు..
అయితే ఆ విమానం శ్రీకాళహస్తి ( Srikalahasti) మండలం గుండ్ల పల్లె పొలంలో అత్యవసర లాండింగ్ అయింది. అయితే ఒకేసారి భారీగా శబ్దం రావడంతో గ్రామస్తులు ఆందోళనతో పరుగులు తీశారు. ఆ సమయంలో దేశి రెడ్డి అనే వ్యక్తి ధైర్యం చేశారు. అప్పటికి ఆయన ఆ గ్రామ సర్పంచ్. అయితే ఒకేసారి భారీ విమానం పొలాల్లో పడడం.. బురదలో కూరుకుపోవడం.. వారిని రక్షించే క్రమంలో దేశి రెడ్డి ముందుకెళ్లగా అక్కడ ఉన్నవారు ఆపివేశారు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పడంతో దేశిరెడ్డి వెనక్కి తగ్గారు. అయితే ఆ విమానంలో ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య, విజయశాంతితో సహా 60 మందికి పైగా సినీ ప్రముఖులు ఉండడం అప్పట్లో సంచలనంగా మారింది. వారంతా కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్నారు. మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్, కాస్ట్యూమ్స్ కృష్ణ, దర్శకులు కోడి రామకృష్ణ,ఎస్ వి కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, బాపు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, ఎండి సుందరం, నిర్మాతలు కేసీ శేఖర్ బాబు, కాట్రగడ్డ ప్రసాద్, రాసి మూవీస్ నరసింహారావు, డాన్స్ మాస్టర్స్ సుచిత్ర, ఫైట్ మాస్టర్ సుబ్బరాయన్.. ఇలా చాలామంది ఉన్నారు.
Also Read: Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమానం అందుకే క్రాష్ అయిందా.. విచారణలో కొత్త ఆధారం
సజీవ సాక్షిగా దేశిరెడ్డి
అయితే తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో.. తిరుపతికి చెందిన జర్నలిస్టు నాటి సర్పంచ్, ఘటనకు సజీవ సాక్షిగా ఉన్న దేశి రెడ్డిని( desi Reddy ) పలకరించారు. దీంతో దేశి రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆరోజు అర కిలోమీటర్ మేర భూమిపై రాసుకుంటూ విమానం వెళ్ళిన విషయాన్ని వెల్లడించారు. ఆ గ్రామంలో చెరువుగట్టు, చిన్న కొండను తప్పించి పొలాల్లో విమానాన్ని దించారని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య తీవ్ర షాక్ లో ఉండగా తాను సఫర్యలు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా అల్లు రామలింగయ్య చాలా భయపడ్డారని.. ఏమీ కాలేదు భయపడకండి అంటూ ధైర్యం చెప్పిన విషయాన్ని కూడా దేశ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మా గ్రామస్తుల సహాయక చర్యలను గుర్తించి.. మీకు ఏ విధమైన సాయం కావాలని వారు అడిగారని.. హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుందని చెప్పానని.. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదని ఆవేదనతో చెప్పారు. అయితే నాటి గురుతులను గుర్తు చేసుకుంటూ దేశి రెడ్డి ఎంతగానో ఉద్వేగానికి గురయ్యారు. సదరు జర్నలిస్టు కార్తిక్ ఇదే విషయాలను చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అది విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పటికైనా నాటి శని ప్రముఖులు స్పందించి ఆ గ్రామంలో ఆసుపత్రి నిర్మించాలని ఎక్కువమంది కోరుతున్నారు.