Plane crash Latest Update: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత చాలామంది ప్లేన్ జర్నీ అంటే భయపడిపోతున్నారు.ఎన్నో సంవత్సరాల నుంచి అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. వీటిలో చాలామంది చనిపోయారు. కానీ కొన్ని విమాన ప్రమాదాలు జరిగినప్పటికీ ఎటువంటి ప్రార నష్టం జరగని సంఘటనలు కూడా ఉన్నాయి. అమెరికాలో జరిగిన విమాన ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 155 మందితో వెళ్లిన ఈ విమానం పక్షుల గుంపు అడ్డు రావడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కానీ కొంతమందికి మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇంతకీ ఆ అభిమాన స్టోరీ ఏంటంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత గతంలో జరిగిన విమాన ప్రమాదాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీటిలో 2009లో న్యూయార్క్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. న్యూయార్క్ నగరం నుంచి 155 మందితో టేక్ ఆఫ్ అయినా విమానానికి పక్షుల గుంపు ఎదురయింది. దీంతో విమానంలోని రెండు ఇంజన్లు దెబ్బతిన్నాయి. అయితే వెంటనే విమాన పైలట్ అప్రమత్తమయ్యారు. విమానం కుప్పకూలిపోతుంది అని గుర్తించిన ఆయన.. తిరిగి విమానాశ్రయానికి వస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే అది సాధ్యం కాదని తెలియడంతో వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న హడ్సన్ నదిలోకి దింపాడు.
అయితే ఈ నదిలోని నీరు మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్నాయి. ఈ నీళ్లు విమానంలోకి వచ్చాయి. దీంతో ఇందులో ఉన్న ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా విమాన రెక్కల పైకి వచ్చారు. ఇంతలో సమాచారం అందుకున్న ఫెర్రీ బోట్లు, నౌకలు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాయి. వెంటనే ప్రయాణికులను విమానంలో నుంచి దింపి సురక్షిత ప్రాంతానికి చేరవేశాయి. ఇదే సమయంలో నౌకలు విమానానికి తాళ్లు కట్టి మునిగిపోకుండా అపాయి. అయితే అదృష్టవశాత్తు 155 మంది ఉన్నా ఇందులో ఒక్కరికి ప్రాణాపాయం కాలేదు. కొంతమందికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి.
Also Read: Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమానం అందుకే క్రాష్ అయిందా.. విచారణలో కొత్త ఆధారం
మరోవైపు పైలట్ కెప్టెన్ సల్లెన్బర్గ్ అప్రమత్తతో విమానంను నదిలోకి దింపి అంత మంది ప్రాణాలను కాపాడినందుకు అతనిపై ప్రశంసలు కురిపించారు. చాలా సమయంలో పైలట్ అప్రమత్తతోనే విమాన ప్రమాదాలు తప్పుతూ ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితులు చేయి దాటిన తర్వాత పైలెట్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవచ్చు. ఇలా ఈ విమాన ప్రమాదం చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా ప్రయాణికులు వెళ్లిన తర్వాత ఈ విమానాన్ని మ్యూజియంలో పెట్టారు. దీనిని చూసినప్పుడల్లా ఆ విమాన ప్రమాదం గుర్తుకు వస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన మృతులను గుర్తిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.