గల్ఫ్ యుద్ధానికి తెరపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మేరకు సీజ్ ఫైర్ మొదలవుతుందని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఉదయం 9.30 గంటల నుంచి ఈ కాల్పుల విరమణ మొదలవుతుందని తెలిపారు. భారత కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం ఇరాన్ అమలు చేస్తుందని తెలిపారు. తర్వాత ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ చేస్తుందని తెలిపారు.
దీనిపై ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం ప్రతిస్పందించలేదు. 12 రోజుల ఈ యుద్ధం ఏం జరిగింది? యుద్ధం ఎలా మొదలైంది. ఇరాన్ అణుబాంబు తయారీకి రెడీ కావడమే ఈ యుద్ధానికి కారణం. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి దిగడంతో యుద్ధం మొదలైంది.
తర్వాత అమెరికా రంగంలోకి దిగి అణుస్థావరాలపై దాడులు నిర్వహించింది. తర్వాత ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. ఈ 12 రోజుల యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించాడు.
12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి తెరపడింది? గల్ఫ్ యుద్ధం లో ఎవరు విజేతలు.? ఎవరు పరాజితులు అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
