HomeజాతీయంGandhi jayanti: గాంధేయవాదం అంటే ఏంటో తెలుసా.. ఇప్పటికాలానికి మనుషులకు ఎలా అవసరమంటే..

Gandhi jayanti: గాంధేయవాదం అంటే ఏంటో తెలుసా.. ఇప్పటికాలానికి మనుషులకు ఎలా అవసరమంటే..

Gandhi jayanti: మహాత్మా గాంధీ జాతిపిత.. దేశాన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులను వారి దేశానికి తరిమికొట్టిన ఘనుడు.. దేశానికి స్వాతంత్రం ఉండాలని.. దేశం మొత్తం ఒకే తాటిమీద ఉండాలని భావించిన మేధావి.. దేశంలోని అన్ని వర్గాలను సంఘటితం చేసిన ధీశాలి. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను ఒకసారి పరిశీలిస్తే.. ఒకే తాటి మీదికి తీసుకొచ్చి అహింస.. శాంతి.. సత్యం.. సహాయ నిరాకరణ.. ఖాది.. వీటిని […]

Gandhi jayanti: మహాత్మా గాంధీ జాతిపిత.. దేశాన్ని వందల సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులను వారి దేశానికి తరిమికొట్టిన ఘనుడు.. దేశానికి స్వాతంత్రం ఉండాలని.. దేశం మొత్తం ఒకే తాటిమీద ఉండాలని భావించిన మేధావి.. దేశంలోని అన్ని వర్గాలను సంఘటితం చేసిన ధీశాలి. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను ఒకసారి పరిశీలిస్తే..

ఒకే తాటి మీదికి తీసుకొచ్చి

అహింస.. శాంతి.. సత్యం.. సహాయ నిరాకరణ.. ఖాది.. వీటిని ఆయుధాలుగా మార్చుకొని గాంధీ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. దేశం మొత్తాన్ని కదిలించారు. స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. తద్వారా దేశాన్ని వందల సంవత్సరాలుగా పరిపాలిస్తూ.. దోచుకుంటున్న ఆంగ్లేయులకు గట్టి బుద్ధి చెప్పారు.. సంస్థానాలుగా.. వెరీ వెరీ రాజ్యాలుగా ఉన్న దేశాన్ని ఒకే తాటి మీదికి తీసుకొచ్చి.. దేశం అనే భావన కలిగించారు. సువిశాలమైన భారతదేశాన్ని నిర్మించారు.

ఆయన ప్రస్తావన లేకుండా

గాంధీ గతించి దశాబ్దాలు దాటుతోంది. అయినప్పటికీ నేటికీ ఆయన ప్రస్తావన లేకుండా ప్రపంచం ముందుకు సాగడం లేదు. యుద్ధం జరిగినప్పుడు.. మనుషులు హక్కుల కోసం పోరాడినప్పుడు.. సమస్యలు ఎదురైనప్పుడు.. ప్రభుత్వాలతో పోరాటం చేయాల్సినప్పుడు.. హింస చెలరేగుతున్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలో గాంధీ మహాత్ముడు ప్రజలకు గుర్తుకు వస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు పెరిగిపోయాయి. ఈ సమయంలో కూడా యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాడే వారు గాంధీ మహాత్ముడిని తలచుకుని శాంతియుత పోరాటాలు చేస్తున్నారు. ఇందులో అపజయం ఉందా.. విజయం ఉందా అనే విషయాన్ని పక్కన పెడితే.. వారిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి మాత్రం మాటికి గాంధీ మహాత్ముడే.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో గాంధీని ఆదర్శంగా తీసుకొని

ఇటీవల కాలంలో పాక ఆక్రమిత కాశ్మీర్లో.. అక్కడి ప్రజలను పాకిస్తాన్ పాలకులు ఇబ్బంది పెడుతున్నారు. నరకం చూపిస్తున్నారు. ఇంటర్నెట్ బందు పెట్టారు. నిత్యావసరాలు అందకుండా చేశారు. కనీసం నీళ్లు కూడా లభించకుండా చూశారు. అయినప్పటికీ అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా.. పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు. అందులో విజయం సాధించారు. ఇక్కడ కూడా గాంధీ ప్రస్తావన వచ్చింది. గాంధీని ఆదర్శంగా తీసుకొని తాము ఇదంతా చేస్తున్నామని అక్కడి ప్రజలు చెప్పడం విశేషం.

అహింస.. శాంతి.. సహాయ నిరాకరణ.. ఖాది దుస్తులు.. సత్యం పలకడం.. వీటన్నిటిని అనుసరించి దేశానికి స్వాతంత్రం సాధించిన ఘనుడు మహాత్మా గాంధీ. అందువల్లే నేటి తరానికి కూడా ఈ గాంధీ గురించి.. ఆయన అనుసరించిన వాదం గురించి నేర్చుకోవడం అవసరం.. నేటి కాలంలో కూడా గాంధీ జీవిత చరిత్రను అనుసరించే విధంగా శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్.. వంటి సినిమాలు వచ్చాయంటే మామూలు విషయం కాదు.

గాంధీ సూచించిన సూక్తులు

  • కన్నుకు కన్నే సమాధానమైతే ఈ లోకం మొత్తం అంధకారం అవుతుంది.
  • ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్ని మాత్రమే చెప్పాలి. అదే మనల్ని రక్షిస్తుంది.
  • ఆయుధం అనేది పరిష్కారం కాదు. అది సమస్య తీవ్రతను పెంచుతుంది. ఇద్దరు వ్యక్తులు పరస్పరం పోరాటం చేస్తే అది మూర్ఖుల యుద్ధం లాగానే ఉంటుంది.
  • స్థానికత అనేది బలమైన బీజం.. దానిని మరింత పాదు చేసుకుంటూ పోతే జీవితమంతా పచ్చగా ఉంటుంది.
  • ఆశ అనేది జీవితాన్ని ముందుకు సాగేలా చేస్తుంది. నిరాశ అనేది జీవితానికి వ్యతిరేక కోణంలో సాగుతుంది.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper