Lenovo Yoga Tab Gen 2 : టాబ్లెట్ విభాగంలో మనదేశంలో లెనోవో కంపెనీకి తిరుగులేని మార్కెట్ ఉంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ టాబ్లెట్ల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఈ కంపెనీ యోగా టాబ్ జెన్ 2 అనే కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇటీవల జరిగిన ఐఫా ఈవెంట్ లో ఈ కొత్త మోడల్స్ ను ఆవిష్కరించింది. ఈ రెండు టాబ్లెట్లు అద్భుతమైన 4k 144 Hz display, అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్, ఏడు సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓ ఎస్ అప్డేట్స్ ఈ మోడల్స్ లో అందుబాటులోకి వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 17 నుంచి 24 వరకు ఇవి ఓఎస్ అప్ గ్రేడ్స్ ఇస్తాయి.
లెనోవా యోగ ట్యాబ్ జెన్ 2 vs ప్లస్ జన్ 2 మధ్య పోలికలను ఒకసారి చూస్తే..
Yoga tab Gen 2
ఇందులో డిస్ ప్లే పరిమాణం 11.1 ఇంచులుగా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 4k(3840*2560), 445 ppi.
ప్రాసెసర్ మీడియా టెక్ డైమన్ సిటీ 9500 ఎస్
ర్యామ్& స్టోరేజీ.. గరిష్టంగా 12 జిబి రామ్/ 256 జిబి స్టోరేజ్.
బ్యాటరీ కెపాసిటీ.. 11000 mAh(68W ఫాస్ట్ ఛార్జింగ్)
స్పీకర్లు.. 4 హార్మన్ కార్టన్ స్పీకర్లు
బరువు.. సుమారు 480 గ్రాములు
Yoga tab Plus Gen 2
ఈ మోడల్ లో డిస్ ప్లే 13 ఇంచులు గా ఉంది. ఇందులో ప్యూర్ సైట్ ప్రో మోడల్ ఉంటుంది.
స్క్రీన్ రిజల్యూషన్ 4K(3840*2560), 355 ppi
ప్రాసెసర్.. qualcom Snapdragon 8 Elite
Ram and storage.. గరిష్టంగా 16 జిబి రామ్.. 512 జిబి ఎస్ఎస్ డీ
బ్యాటరీ కెపాసిటీ..
12700mAh(68w )
ఈ రెండు మోడల్స్ లో డిస్ ప్లే క్వాలిటీ 144 hz రీ ఫ్రెష్ రేట్.. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్.. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. ఇండోర్.. అవుట్ డోర్ స్క్రీన్ చాలా పారదర్శకంగా కనిపిస్తుంది
ఇవి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 17 తో వస్తున్నాయి. లెనోవో వీటికి 2033 వరకు అంటే దాదాపు ఏడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ.. ఓఎస్ అప్డేట్స్ ఇస్తోంది. టాబ్లెట్ విభాగంలో ఇది అత్యంత అరుదైన విషయం.
Creators కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్టైలిష్ పెన్ 8192 ప్రెజర్ లెవెల్స్.. వినూత్నమైన పెన్ gestures ఇందులో ఉన్నాయి.
ఈ రెండు మోడల్స్ లో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం వైఫై 7, బ్లూటూత్ 6.0 సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు.
ఇండియన్ మార్కెట్లో Lenovo yoga tab Plus Gen 2 ధర 93,000 వరకు ఉంది. సెప్టెంబర్ నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
Lenovo yoga tab Plus (first generation) 16GB RAM/256 GB ROM(with keyboard, tab pen Pro) 64, 999