Hyundai Exter 2026: కాలం మారుతున్న కొద్ది వినియోగదారుల అభివృద్ధిలో మారిపోతున్నాయి. ముఖ్యంగా కార్ల కొనుగోళ్ల విషయంలో కొందరు వినియోగదారులు అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని అనుకుంటున్నారు. ఇదే సమయంలో ధర కూడా తక్కువగా ఉండే కారు కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీలు సైతం వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి అడ్వాన్స్ ఫీచర్స్ ను అందిస్తూ తక్కువ ధరకే వివిధ రకాల మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా Hyundai కంపెనీకి చెందిన Exter కారును లేటెస్ట్ డిజైన్ తో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇందులో ఇంజన్ పనితీరు కూడా మారిందని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..
Hyundai Exter కారు ఇప్పటికే చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఇది కొత్త డిజైన్ తో మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త వెర్షన్ లో రీ డిజైన్ చేసిన గ్రిల్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వింగ్ టైప్ స్పాయిలర్ కారుకు ప్రీమియం లుక్ ను తీసుకొచ్చాయి. అలాగే పొడవైన వీల్ బేస్ ఉండడంతో ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తుంది. వెనుక భాగంలో సి పిల్లర్ గార్నిష్ తో మరింత స్మైలింగ్ లుక్ వచ్చింది. కాఫీ లోపల సైతం ప్రీమియం లుక్ తో ఉండేలా మార్చేశారు. ఇందులో 3d కార్బన్ పాటర్న్ డాష్ బోర్డు వంటివి చూస్తే ఒక భవనంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది.
ఇంటీరియర్ డిజైన్ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అందించారు. ఈ కొత్త కారులో యూఎస్బీ టైప్ సి పోర్టు, అడ్వాన్స్ డిజిటల్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే అలరిస్తాయి. అంతేకాకుండా డాష్ బోర్డు మరింత అందంగా కనిపిస్తుంది. Hyundai Exter ఇండియన్ విషయంకొస్తే ఇందులో 1.2 లీటర్ 4 సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పని చేయడం వల్ల డ్రైవర్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వల్ల నగరాల్లో ప్రయాణించే వారికి, లాంగ్ జర్నీ చేసే వారికి స్మూత్ డ్రైవ్ ను అందిస్తుంది. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎస్, HAC వంటి కీలక ఫీచర్లు సేఫ్టీని అందిస్తాయి. వీటితోపాటు 30 స్టాండర్డ్ ఫ్యూచర్లు కూడా ఉన్నాయి.
SUV వేరియంట్ లో తక్కువ ధరకే కారు కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ కార్ అని అంటున్నారు. దీనిని. రూ.5.79 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.40 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ SUV ఆర్ కోసం ఎదురుచూసే వారికి ఇది బెస్ట్ కార్ అని నిపుణులు అంటున్నారు.
