Homeబిజినెస్Upcoming Sub 4 Meter Compact SUV Cars: SUV వలే ఉంటాయి.. కానీ ధర...

Upcoming Sub 4 Meter Compact SUV Cars: SUV వలే ఉంటాయి.. కానీ ధర తక్కువ.. మధ్యతరగతి వారి కోసమే ఈ కార్లు..

Upcoming Sub 4 Meter Compact SUV Cars: కుటుంబంలో కలిసి కార్లలో ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది. అయితే నలుగురి కంటే ఎక్కువగా ఉన్న కుటుంబ సభ్యులు ప్రయాణం చేయాలంటే SUV కారు తప్పనిసరిగా కావాలి. కానీ వీటి ద్వారా అధికంగా ఉంటుంది. మధ్య తరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి బడ్జెట్ సరిపోదు. అయితే SUV కి చిన్నగా ఉండే SUB 4 మీటర్ కాంట్రాక్టు SUV కార్లు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉంటాయి. ఈ కారులో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే ఫీచర్లు SUV వలే ఉంటాయి. కానీ SUV తో పోలిస్తే ధర తక్కువగా ఉంటుంది. దీంతో ఇటీవల మినీ SUV కార్లకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు కంపెనీలు గుర్తించాయి. దీని దృష్టిలో ఉంచుకొని త్వరలో మార్కెట్లోకి కొన్ని ఈ టైప్ ఆఫ్ కార్లు రాబోతున్నాయి. ఆ కార్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ కంపెనీ Maruti Suzuki నుంచి కొత్తగా Facelift కారు రాబోతుంది. ఇప్పటికే మార్కెట్లో SUV గా పేరొందిన Brezza ఇప్పుడు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV మాకు ఎక్కువ అడుగుపెట్టబోతుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు ధర రూ.8 లక్షల ప్రారంభ ధర నుంచి ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుండడంతో వియత్నాం కంపెనీకి చెందిన VinFast VF3 అనే EV కారు త్వరలో రాబోతుంది. ఈ కారులో 18.6 kWh బ్యాటరీ బ్యాక్ ఉండనుంది. ఈ బ్యాటరీ 43.5 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తూ ముందుకు వెళ్తుంది. దీనిని రూ.8 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లే ఈ కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బాగా సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.

SUV రారాజుగా పేర్కొనే Mahindra కంపెనీ నుంచి Vision X త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతుంది. ఈ కొత్త కారు ఈ ఏడాది చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే ఎస్ యు వి గా ఎన్నో కార్లు తీసుకొచ్చిన మహేంద్ర కంపెనీ ఇప్పుడు కొత్తగా సబ్ 4 మీటర్ కారుతో అలరించనుంది. అలాగే ఉందా ఈ కంపెనీకి చెందిన Exter కార్ కూడా సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV గా రాబోతోంది. ఈ కారులో ఇంటీరియర్స్ ఫీచర్స్ అప్డేట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ లో దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.

Honda కంపెనీకి చెందిన WR V అనే కారు మిడిల్ క్లాస్ పీపుల్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉండడంతో పాటు SUV ని తలపించేలా ఈ కారు ఉంటుందని అంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular