Venkatesh Anil Ravipudi New Movie Heroine: వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్స్ తో మంచి ఊపు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi), తన తదుపరి చిత్రాన్ని ఏ హీరో తో చేయబోతున్నాడు అనే అంశం పై సోషల్ మీడియా లో గత కొంతకాలం ఏ రేంజ్ చర్చ నడిచిందో మనమంతా చూశాము. అయితే మొన్న రాత్రి అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసాడు. ఇందులో వెంకటేష్(Victory Venkatesh) తో పాటు , నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మరో హీరో గా నటించబోతున్నాడని , వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన స్పెషల్ వీడియో కి కూడా మంచి రీచ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!
అదేంటంటే ఈ చిత్రం లో హీరోయిన్ గా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే అనిల్ రావిపూడి ఆమెని కలిసి స్టోరీ ని వినిపించాడని, అది ఆమెకు తెగ నచ్చేసింది అంటున్నారు. త్వరలోనే మొదలు కాబోతున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లోనే కీర్తి సురేష్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఈమె విక్టరీ వెంకటేష్ కి జోడీ గా నటించబోతుంది అట. మరి కళ్యాణ్ రామ్ కి జోడిగా ఎవరు నటించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ బ్యూటీ నే కళ్యాణ్ రామ్ కి జోడీగా ఎంపిక చేయబోతున్నారు అట. చూడాలి మరి ఎవరు ఆ యంగ్ హీరోయిన్ అనేది. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో కొన్ని మార్పులు చేస్తున్నాడట అనిల్ రావిపూడి.
ఇంతకు ముందు వెంకటేష్ మెయిన్ హీరోగా, మరో హీరో కీలక పాత్రగా కథ రాసుకున్నాడట . ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇవ్వడంతో కీలక పాత్రని కాస్త కథని నడిపించే మరో హీరో పాత్రగా మార్చారట. అంటే ఈ సినిమా మల్టీస్టార్రర్ గా తెరకెక్కబోతుంది అన్నమాట. ఒకవైపు తనకు కెరీర్ లో మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన హీరో, మరోవైపు తనని స్టార్ డైరెక్టర్ ని చేసిన హీరో, వీళ్ళిద్దరిని బ్యాలన్స్ చేస్తూ ఎలాంటి సినిమా తీయబోతున్నాడో ఈసారి చూడాలి. ఉగాది కి ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.