83 Movie: భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరం ఒక మరుపురాని మైలురాయిని మిగిల్చింది అని చెప్పాలి. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు విశ్వ విజేతగా ఆ సంవత్సరం వరల్డ్ కప్ ను అందుకుంది. ఆ విజయం వెనుక ఉన్న కష్టాన్ని మన కళ్ళకు కట్టేందుకు సిద్దమయ్యారు డైరెక్టర్ కబీర్ ఖాన్. ఆ అసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా రణ్ వీర్ సింగ్, కపిల్ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకొనె నటిస్తున్నారు. ఉత్కంఠమైన మలుపులతో దక్కిన ఆ విజయాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేశ్హ స్పందన లభిస్తుంది.
Also Read: ఇది సినిమా టీజర్ కాదు, ఎమోషనల్ జర్నీ !
ఇప్పుడు తాజాగా ఆ మ్యాచ్ లోని ఒక ముఖ్యమైన ఘట్టం గురించి నోరు విప్పారు. 1983 జూన్ 25న ఫైనల్ జరిగింది. అందులో వెస్టిండీస్, ఇండియా జట్లు తలపడ్డాయి. వెస్టిండీస్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. ఆ క్యాచ్ కోసం కెప్టెన్ కపిల్ దేవ్ క్యాచ్ పట్టడం హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ క్యాచ్ కోసం కపిల్ దేవ్ 20 గజాలు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లారట. ఆ క్యాచ్ సీన్‌ను అందుకే ఈ టీజర్లో ఆవిష్కరించామన్నారు. గూజ్ బమ్స్ తెప్పించే ఇలాంటి సన్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయని తెలిపారు. ఇండియన్ క్రికెట్లో మరచిపోలేని అమేజింగ్ జర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 24న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
Also Read: సినిమా టికెట్ల రేట్లు పెంపుపై కండిషన్స్ అప్లయ్..!
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: 83 movie unit interesting facts about kapil dev
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com