2021 Roundup: 2021 ఏడాదిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచేసే సంఘటనలు జరగడం విశేషం. కరోనా విపత్తు దృష్ట్యా ఆసక్తికర విషయాలు జరిగాయి. కరోనా రెండో దశ చుట్టుముట్టినా ప్రపంచం మాత్రం భయపడలేదు. ధీటుగా ఎదురునిలిచింది. అఫ్గాన్ లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నా అమెరికాలో లక్షల మంది చనిపోయినా మయన్మార్ లో సైన్యం అధికారం చేజిక్కించుకున్నా ఈ ఏడాదిలో జరిగిన కొన్ని విశేషాల్ని నెమరు వేసుకుందాం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ తనకు అధికారం దక్కలేదనే అక్కసుతో ఆయన మద్దతుదారులతో జనవరి 6న దాడి చేసి నలుగురి మరణానికి కారణమయ్యారు. దీంతో అక్కడ హింసాకాండ చోటుచేసుకుంది. దీంతో ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది అమెరికాకే మాయని మచ్చగా మిగిలిపోయిందని తెలుస్తోంది.
మయన్మార్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. గత ఏడాది నవంబర్ లో అంగ్ సాన్ సూకీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా సైన్యం కుట్రలతో సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేజిక్కించుకోవడం సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రభుత్వ ఏర్పాటుకు జనరల్ మిన్ అంగ్ నేతృత్వంలో 11 మందితో అధికారం కైవసం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఈజిప్టులోని సూయజ్ కాలువలో మార్చి 23న రవాణా నౌకల్లో ఒకటైన కంటెయినర్ నౌక ఎంవీ ఎవర్ గివెన్ ఇరుక్కుపోయింది. దీంతో 2.20 టన్నుల నౌక ఆగిపోవడంతో మద్యధర, ఎర్ర సముద్రాల్లో 320కి పైగా నౌకలు ఆగిపోవడం తెలిసిందే. 9.6 బిలియన్ డాలర్ల మేర నష్టం కలిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం ఆందోళన కలిగించింది. వాణిజ్యంలో 12 శాతం ఈ కాలువ ద్వారానే కొనసాగుతుందని తెలిసిందే.
Also Read: ఆటో మొబైల్ రంగంలో ‘చిప్స్’ కొరత.. తగ్గిన టూ, ఫోర్ వీలర్ అమ్మకాలు..
కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా జరగలేదు. జులై 24న ప్రారంభమైన ఆటలు ఆగస్టు 9న ముగిశాయి. కరోనా మూలంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ ఒకటే విజయం సాధించింది. పోటీలు మాత్రం చప్పగా సాగాయి. దీంతో స్పాన్సర్లు వెనక్కి తగ్గడంతో ఆటలు వెలవెలబోయాయి. 30 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన దారుణాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.
అఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం వైదొలగడంతో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆగస్టు 15న అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్ల ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. అఫ్ఘాన్ లో రాక్షస పాలన చోటుచేసుకుంది. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాబుల్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడిలో 183 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు.
Also Read: తెలుగు చిత్రపరిశ్రమ హైలెట్స్