https://oktelugu.com/

2021 Roundup: కరోనాతో కకావికలం.. రైతు చట్టాల రద్దుతో అన్నదాతల విజయం

2021 Roundup: 2021 సంవత్సరం కాలగతిలో కలిసిపోనుంది. ఈ ఏడాది ఎక్కువ శాతం కష్టాలే పలకరించాయి. కరోనా ప్రభావంతో మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ముప్పు ముంచుకొచ్చింది. ఫలితంా వేలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. రెండో దశలో యువత పిట్టల్లా రాలిపోయారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు మాత్రం వెనక్కి తీసుకోవడం ఒకటే సంతోషం కలిగించేది. పెగసస్ వ్యవహారం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో గొడవలు, సీడీఎస్ మృతి వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 31, 2021 / 01:52 PM IST
    Follow us on

    2021 Roundup: 2021 సంవత్సరం కాలగతిలో కలిసిపోనుంది. ఈ ఏడాది ఎక్కువ శాతం కష్టాలే పలకరించాయి. కరోనా ప్రభావంతో మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ముప్పు ముంచుకొచ్చింది. ఫలితంా వేలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. రెండో దశలో యువత పిట్టల్లా రాలిపోయారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు మాత్రం వెనక్కి తీసుకోవడం ఒకటే సంతోషం కలిగించేది. పెగసస్ వ్యవహారం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో గొడవలు, సీడీఎస్ మృతి వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

    2021 Roundup

    కొవిడ్ కారణంగా కరోనా మరణాలు రెండు లక్షలు దాటడం సంచలనం సృష్టించింది. దేశంలో ఆక్సిజన్, పడకల కొరతతో ఇబ్బందులు తలెత్తాయి. సుమారు 69 లక్షల కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. రెండో వేవ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. డిసెంబర్ 29 నాటికి దేశంలో సుమారు 143 కోట్ల టీకాలు అందజేయడంతో కరోనా అదుపులోకి వచ్చింది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో ప్రస్తుతం కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మూడో దశ ముప్పు రావచ్చనే సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

    మే నెలలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. రాష్ర్టంలో టీఎంసీ 213 సీట్లు, బీజేపీ 77 సీట్లు దక్కించుకున్నాయి. దీంతో మమతా బెనర్జీ సీఎం అయ్యారు. కానీ నందిగ్రామ్ లో మమత ఓటమి కావడం సంచలనం సృష్టించింది. సువేంద్ అధికారి చేతిలో మమత ఘోర పరాభవం చెందారు. దీంతో భవానీపూర్ నుంచి పోటీ చేసి మళ్లీ గెలిచి మమత పరువు నిలబెట్టుకున్నారు. సీఎం సీటుకు ప్రమాదం లేకుండా చూసుకున్నారు.

    ముఖ్యమంత్రుల మార్పు కూడా ఆందోళన కలిగించింది. కాంగ్రెస్ లో ఉన్న సంప్రదాయమే బీజేపీ కూడా కొనసాగించింది. కర్ణాటకలో సీఎం యడ్యూరప్పను మార్చి బసవరాజు బొమ్మైకి అధికారం కట్టబెట్టారు. అలాగే గుజరాత్ సీఎం విజయ్ రూపానీని పదవి నుంచి తప్పించారు. భూపేంద్ర పటేల్ ను సీఎంగా ఎన్నుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్ సింగ్ ను వైదొలగేలా చేసింది. చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎంగా చేసింది.

    గత ఏడాది తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు ఆందోళన మొదలుపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం పై రైతులు ఏకంగా నిరసనలు చేపట్టాయి. జనవరి 12న రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులు కూడా ఆందోళన విరమించుకోలేదు. ఎన్ని రోజులైనా ప్రభుత్వంతో పోరాడతానని ఆందోళన కొనసాగించడంతో ఇక చేసేది లేక కేంద్రం దిగి వచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

    అక్టోబర్ లో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం నడపడంతో నలుగురు రైతులు మృతి చెందారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. తరువాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోవడం తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన దేశాన్నే ఆందోళనకు గురిచేసింది. అమాయకులైన రైతులను చంపడమేమిటనే ప్రశ్నలు ఉదయించాయి. ప్రతిపక్షాలు చేసిన ఆందోళనను ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.

    Also Read: మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.50కే మూడేళ్ల వారంటీతో ఐదు బల్బులు!

    డ్రగ్స్ వ్యాపారం కూడా కోరలు చాచింది. దేశంలో డ్రగ్స్ మాఫియా చాపకింద నీరులా విస్తరించింది. ఇందులో భాగంగా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఇది కూడా సంచలనం రేపింది. ఇరవై రెండు రోజుల కస్టడీకి పంపించి అనంతరం విడుదల చేశారు. ఒక సెలబ్రిటీని అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

    ఏాడాది చివరలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఆందోళన కలిగించింది. ఆయన భార్య మధులికతో పాటు 13 మంది చనిపోవడం దారుణం. దీనిపై కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరు నివాళి అర్పించారు. భారత ఆర్మీ ప్రధాన అధికారి అర్థంతరంగా అసువులు బాయడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశానికి జరిగిన నష్టంగా అభివర్ణించి కన్నీటి పర్యంతమయ్యారు. వారికి ఘనంగా నివాళులు అర్పించారు.

    Also Read: భారత్ లో థర్డ్ వేవ్ మొదలైందా? మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

    Tags