https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan: ఊసరవెల్లి కంటే దారుణంగా మారిపోయిన ఇనాయ సుల్తానా

Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan: బిగ్ బాస్ సీజన్ 6లో ఈ వారం చాలా ఆసక్తికరమైన టాస్కులతోపాటు భావోద్వేగాల మధ్య ఎంతో అద్భుతంగా సాగింది.. ఈ వారం ప్రతీ ఇంటి సభ్యుడు నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెట్టారనే చెప్పాలి..ముఖ్యంగా ‘చేపల చెరువు’ టాస్కు అదిరిపోయింది.. ఇన్ని రోజులు మనం బిగ్ బాస్ నుంచి ఎలాంటి గేమ్స్ కోరుకున్నామో..అలాంటి గేమ్స్ అన్నీ ఈ వారం పెట్టాడు బిగ్ బాస్..కెప్టెన్ గా ఎవరు గెలుస్తారు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 28, 2022 / 07:58 AM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan: బిగ్ బాస్ సీజన్ 6లో ఈ వారం చాలా ఆసక్తికరమైన టాస్కులతోపాటు భావోద్వేగాల మధ్య ఎంతో అద్భుతంగా సాగింది.. ఈ వారం ప్రతీ ఇంటి సభ్యుడు నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెట్టారనే చెప్పాలి..ముఖ్యంగా ‘చేపల చెరువు’ టాస్కు అదిరిపోయింది.. ఇన్ని రోజులు మనం బిగ్ బాస్ నుంచి ఎలాంటి గేమ్స్ కోరుకున్నామో..అలాంటి గేమ్స్ అన్నీ ఈ వారం పెట్టాడు బిగ్ బాస్..కెప్టెన్ గా ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కలిగించేలా చెయ్యడంలో ఈ వారం కంటెస్టెంట్స్ సఫలీకృతం అయ్యారు.

    Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan

    అలా హోరాహోరీగా సాగిన ఈ కెప్టెన్సీ టాస్కులో టాప్ 3 కంటెండర్లు గా శ్రీహన్ , కీర్తి మరియు సూర్య నిలిచారు..వీరిలో ఇంటి సభ్యులకు ఎవరికి కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదో, వాళ్లకి కారణాలు చెప్పి వారి మేడలో వేసుకున్న ‘C’ ఆకారం తో చేసిన థెర్మోకోల్ పై కత్తి తో గుచ్చాలి..దీనికి ఫైమా సంచాలకులుగా వ్యవహరించింది.

    హౌస్ మేట్స్ అధిక శాతం సూర్య మాకు కెప్టెన్ గా అక్కర్లేదని కత్తి తో గుచ్చగా, గీతూ మరియు బాలాదిత్య కీర్తి కి గుచ్చుతారు..ఇక ఇనాయ సుల్తానా ట్విస్ట్ లు మీద ట్విస్టులు ఇస్తూ చివరికి శ్రీహాన్ కి గుచ్చుతుంది..శ్రీహాన్ కి గుచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ ‘నువ్వు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చాయి..కానీ నీకు స్థిరత్వం లేదని అనిపించింది..నువ్వు చెప్పిన దాని మీద నిలబడవు..గత వారం బాలాదిత్య ని నువ్వు ఏ కారణం చేత అయితే నామినేట్ చేసావో..ఇప్పుడు ఆయన చేసిందే మొన్న నువ్వు ‘చేపల చెరువు’ టాస్కులో చేసావు.. నాకు ఎందుకో నువ్వు కెప్టెన్ గా కరెక్ట్ కాదు అనిపించింది’ అని చెప్తుంది.

    Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan

    అప్పుడు శ్రీహాన్ దానికి సమాధానం చెప్తూ..’నువ్వు ఏ కారణం తో నాకు ఈ కత్తి గుచ్చావో నాకు తెలుసు లే..నువ్ చెప్పిన రీజన్ సరైనదో కాదో జనాలు నిర్ణయిస్తారు’ అని బదులిస్తాడు.. ఇక ఆ తర్వాత శ్రీ సత్యతో బయట గార్డెన్ లో కూర్చొని శ్రీహాన్ మాట్లాడుతూ ‘నాకు స్థిరత్వం లేదు అట..కాసేపు సూర్య తో బాగుంటది..కాసేపు నన్ను పొగుడుతది..నిమిషానికి ఒకలాగా ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మార్చే ఆమె నన్ను అంటుంది చివరికి..ఇప్పుడు కాదులే నాకు అవకాశం వచ్చినప్పుడు ఈసారి దానికి చుక్కలు చూపిస్తాను’ అంటూ శ్రీహన్ శ్రీ సత్య తో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

    ఇనాయా అటు సూర్యకు సపోర్టు చేస్తూ.. ఇటు శ్రీహాన్ ను మోసం చేస్తూ.. అదే సమయంలో సూర్యకు కూడా సహకరించకుండా ఊసరవెళ్లిలా రంగుల మారుస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.

     

     

    Tags