https://oktelugu.com/

Pawan Kalyan Kushi Re-Release: ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో పండుగ

Pawan Kalyan Kushi Re-Release: ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అభిమానులు ఏర్పాటు చేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ కి ఎలాంటి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ స్పెషల్ షోస్ కి జనాల్లో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది..టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడం తో షోస్ సంఖ్య పెంచుకుంటూ పొయ్యారు..అలా పెంచుకుంటూ పోతూ జల్సా సినిమా స్పెషల్ షోస్ సంఖ్య 700 కి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2022 / 02:45 PM IST
    Follow us on

    Pawan Kalyan Kushi Re-Release: ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అభిమానులు ఏర్పాటు చేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ కి ఎలాంటి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ స్పెషల్ షోస్ కి జనాల్లో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది..టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడం తో షోస్ సంఖ్య పెంచుకుంటూ పొయ్యారు..అలా పెంచుకుంటూ పోతూ జల్సా సినిమా స్పెషల్ షోస్ సంఖ్య 700 కి పైగా చేరింది..ప్లాన్ చేసిన ఈ షోస్ అన్ని కూడా హౌస్ ఫుల్ అయ్యాయి.. వర్కింగ్ డే రోజు రిలీజ్ సినిమాకి దొరికాల్సిన అద్భుతమైన రిసీవ్ ఈ సినిమాకి దొరకడం పవన్ కళ్యాణ్ కి జనాల్లో ఉన్న క్రేజ్ కి నిదర్శనం..ఈ షోస్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని చూసి డిస్ట్రిబ్యూటర్స్ పవన్ కళ్యాణ్ పాత సినిమాలని రీమాస్టర్ చేయించి విడుదల చేయించాల్సిందిగా నిర్మాతలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు..

    Pawan Kalyan

    డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ మరోసారి మన ముందు ఖుషి సినిమా ద్వారా థియేటర్స్ లోకి రాబోతున్నాడు..ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంత ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు..ఈరోజు ఆయన యూత్ లో అనితరసాధ్యమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడంటే దానికి కారణం ఖుషి సినిమానే.. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

    Also Read: Rashmika Mandanna: రష్మిక ఆటోగ్రాఫ్ అతని గుండెలపై.. చూస్తే తట్టుకోలేరు

    ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎవ్వరు ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా చెక్కు చెదరని కల్ట్ ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా..అప్పట్లో ఈ సినిమాని రెండేళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తే..రీ రిలీజ్ లో కూడా అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా..అలాంటి సినిమాని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ చెయ్యబోతున్నారు..నేటి తరం పవన్ కళ్యాణ్ అభిమానులు అధికశాతం ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఉండరు..అందువల్ల ఇప్పుడు రీ రిలీజ్ కి అద్భుతమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్..వారి డిమాండ్ ని అర్థం చేసుకునే ఆ చిత్ర నిర్మాత AM రత్నం గారు ఖుషి సినిమాని రీ మాస్టర్ చేసి పెట్టుకొని ఉన్నాడు.

    Pawan Kalyan

    ఈ ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ తోనే అనితర సాధ్యమైన రికార్డ్స్ ని సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫాన్స్..ఇప్పుడు ఖుషి సినిమాతో ఎలాంటి వండర్స్ సృష్టించబోతున్నారో అని ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా సాగుతున్న చర్చ.

    Also Read: Ponniyin Selvan Ticket Price: దర్శకుడు మణిరత్నం అనూహ్యనిర్ణయం… రూ. 100 కే పొన్నియిన్ సెల్వన్ టికెట్!

    Tags